పకడ్బందీ నిర్వహణకు..
ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 859 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎర్రగుట్ట వద్ద ఉన్న గురుకుల బాలికల పాఠశాల సెంటర్–ఎ లో 220 మంది, సెంటర్–బి లో 219 మంది, ప్రభుత్వ బాలికల పాఠశాలలో 209, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 201 మంది విద్యార్థులను కేటాయించారు. అదేవిధంగా ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ చొప్పున నలుగురిని నియమించారు. ఒక్కో పరీక్ష కేంద్రానికి 10 మంది ఇన్విజిలేటర్ల చొప్పున మొత్తం 40 మందిని కేటాయించారు. అదేవిధంగా మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఒక్కో కేంద్రంలో ఇద్దరు ఏఎన్‌ఎంల చొప్పున మొత్తం 8 మందిని నియమించారు. కేంద్రానికి ఒక్కరు చొప్పున మొత్తం నలుగురు పోలీస్ సిబ్బందిని బందోబస్తుకు కేటాయించారు.
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలో ఆదివారం జరగనున్న ఎన్‌ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్) అర్హత పరీక్షకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. పేద విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రవేశ పరీక్షను ఏటా నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు ఏడోతరగతి పూర్తయి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఎంపికై న విద్యార్థులకు ఏటా రూ.12 చొప్పున నాలుగు సంవత్సరాల పాటు రూ.48 వేల ఆర్థిక సాయం పొందుతారు.
హాల్‌టిక్కెట్ తప్పనిసరి..
ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు జిల్లాకేంద్రంలో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో యాద్గిర్ రోడ్ సమీపం ఎర్రగుట్ట వద్ద ఉన్న బాలికల గురుకుల పాఠశాల (టీజీడబ్ల్యూఆర్‌ఎస్)లో సెంటర్–ఏ, సెంటర్–బి, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గ్రౌండ్) ఉన్నాయి. విద్యార్ధులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్ధులు తమ వెంట కచ్చితంగా హాల్‌టికెట్, ఆధార్‌కార్డు లేదా పాఠశాల గుర్తింపుకార్డు, బ్లూ, బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ తీసుకుపోవాలి.
నేడు ఎన్‌ఎంఎంఎస్ అర్హత పరీక్ష
జిల్లాకేంద్రంలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
హాజరుకానున్న 859 మంది విద్యార్థులు
40 మంది ఇన్విజిలేటర్ల కేటాయింపు
ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు
ఏర్పాట్లు పూర్తిచేశాం..
జిల్లాకేంద్రంలో ఆదివారం జరిగే ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. శనివారం ఇన్విజిలేషన్ చేసే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. కేంద్రాల్లో ఎలాంటి ఘటనలకు తావులేకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాం.
– డా. గోవిందరాజు, జిల్లా విద్యాధికారి


