నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఈ ఏడాది నుంచి 8వ తరగతి, ఆపై తరగతుల విద్యార్ధులకు నీట్, ఐఐటీ తరగతులతో పాటు భవిష్యత్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా నాణ్యమైన విద్య అందిస్తామని మైనార్టీ గురుకులాల కార్యదర్శి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జ్ ఫరీదుద్ధీన్ తెలిపారు. మైనార్టీ గురుకుల పాఠశాల ఎస్‌ఓఈ (స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్)గా ఎంపిక కాగా శనివారం అధికారికంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై ఎస్‌ఓఈ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. కొన్నేళ్లుగా అత్యున్నత ఫలితాలు సాధిస్తున్నందున మైనార్టీ గురుకుల కార్యదర్శి షఫీఉల్లా గుర్తించి ఉమ్మడి జిల్లాలో కేవలం ఈ పాఠశాలను ఎంపికచేయడం హర్షణీయమన్నారు. అనంతరం ఆర్‌ఎల్‌సీ కిరణ్మయి మాట్లాడుతూ.. గొప్ప ఆశయంతో చదివే విద్యార్థులను టిమ్రిస్ ఎల్లప్పుడు ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తోందని తెలిపారు. కార్యక్రమంలో అకాడమిక్ కో–ఆర్డినేటర్ సలీం, ప్రిన్సిపాల్ ఖాజా మహబూబ్‌ఖాన్, ఉపాధ్యాయ బృందం అబ్దుల్ సలీం, ఖాసీం హుస్సేన్, సుదర్శన్, ఖలీదా, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


