జాతీయస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

Oct 30 2026 2:27 AM | Updated on Oct 30 2026 2:27 AM

ధన్వాడ: మండలంలోని కొండాపూర్‌ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థి అరుణ్‌ 70వ ఎస్‌జీఎఫ్‌ జాతీయ ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ రాజారాం గురువారం తెలిపారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌ కమ్‌ సెలక్షన్స్‌లో విద్యార్థి అద్భుత ప్రతిభ కనబర్చి జాతీయజట్టుకు ఎంపికయ్యారన్నారు. నవంబర్‌ 2 నుంచి 6వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో జరిగే జాతీయస్థాయి పోటీలో తెలంగాణ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోచ్‌ డా. రామ్మోహన్‌గౌడ్‌, పీఈటీ ఆంజనేయులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు విద్యా ర్థిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement