ప్రత్యేక అవసరాల పిల్లలు స్ఫూర్తి ప్రదాతలు | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక అవసరాల పిల్లలు స్ఫూర్తి ప్రదాతలు

Oct 30 2026 2:27 AM | Updated on Oct 30 2026 2:27 AM

నారాయణపేట ఎడ్యుకేషన్‌: ప్రత్యేక అవసరాల పిల్లలు మనందరికీ నిజమైన స్ఫూర్తి ప్రదాతలని.. శారీరక పరిమితులు అధిగమించి క్రీడల్లో వారు చూపిస్తున్న ధైర్యం, పట్టుదల ఆదర్శమని జిల్లా విద్యాధికారి గోవిందరాజు అన్నారు. వారిని ప్రోత్సహించడం అందరి బాధ్యతని.. అన్నిరంగాల్లో రాణించేలా కృషి చేద్దామని తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో తెలంగాణ విద్యాశాఖ మరియు సమగ్రశిక్ష సంయుక్తంగా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహించగా.. ఆయనతో పాటు పుర వైస్‌ చైర్మన్‌ మంజుల ముఖ్యఅతిథులుగా హాజరై క్రీడలను ప్రారంభించి మాట్లాడారు. ప్రతి విద్యార్ధికి సమాన విద్యావకాశాలు కల్పించాలని, క్రీడలు నిర్వహించి వారిలో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలు, ఆత్మస్థైర్యాన్ని వెలికి తీయాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రత్యేక అవసరాల విద్యార్థులకు రన్నింగ్‌, మ్యూజికల్‌ చైర్‌, స్పూన్‌ రేస్‌, క్యారమ్‌, చెస్‌ తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు సీఎంఓ రాజేంద్రకుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారి నాగార్జున్‌రెడ్డి, మధ్యాహ్న భోజన సమన్వయకర్త యాదయ్యశెట్టి, జిల్లా సైన్స్‌ అధికారి భానుప్రకాష్‌, పీడీలు బాలరాజు, సాయినాథ్‌, రత్నయ్య, మౌలాలి, శ్రీధర్‌, బీరప్ప, బసంత్‌ రెడ్డి, ఐఈఆర్పీలు, స్పెషల్‌ ఎడ్యుకేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement