ప్రజాభద్రతేప్రధాన లక్ష్యం : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

ప్రజాభద్రతేప్రధాన లక్ష్యం : ఎస్పీ

Oct 30 2026 2:27 AM | Updated on Oct 30 2026 2:27 AM

కోస్గి రూరల్‌: ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీస్‌ వ్యవస్థ మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఎస్పీ డా. వినీత్‌ తెలిపారు. గురువారం గుండుమాల్‌లో పోలీస్‌స్టేషన్‌ నిర్మాణానికి స్థల పరిశీలన చేసి మాట్లాడారు. పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాల నియంత్రణే లక్ష్యంగా చేపడుతున్నామని తెలిపారు. ఫిర్యాదులపై తక్షణ స్పందన, నేరాల నియంత్రణపై దృష్టి సారిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సీఐ సైదులు, ఎస్‌ఐ చంద్రశేఖర్‌, విజయ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

నారాయణపేట ఎడ్యుకేషన్‌: జిల్లాకేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్రం అతిథి అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ మెర్సీ వసంత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్‌ 2 సాయత్రం 5లోగా కళాశాలలో దరఖాస్తు అందజేయాలని పేర్కొన్నారు. నవంబర్‌ 3న మౌఖిక పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్ధులు వినియోగించుకోవాలని కోరారు.

వరి క్వింటా రూ.3,694

నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో గురువారం వరి (సోనా రకం) క్వింటా గరిష్టంగా రూ.3,694, కనిష్టంగా రూ.3,650.. హంస రకం సరాసరి రూ.2,410 ధర పలికాయి.

ధాన్యం ధరలు ౖపైపెకి

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పంట దిగుబడులకు మంచి ధరలు లభిస్తున్నాయి. రోజురోజుకూ ధాన్యం ధరలు ౖపైపెకి ఎగబాకుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌ క్వింటాల్‌ గరిష్టంగా రూ.3,701, కనిష్టంగా రూ.2,828 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటాల్‌ గరిష్టంగా రూ.3,139, కనిష్టంగా రూ.2,727, ఆముదాలు క్వింటాల్‌ రూ.7,939, రాగులు క్వింటాల్‌ రూ.5,329 చొప్పున పలికాయి.

పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు అడుగులు

● కొత్తపల్లి, గుండుమాల్‌లో

ఎస్పీ స్థల పరిశీలన

● త్వరలోనే శంకుస్థాపనకు సన్నాహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement