డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం

Oct 30 2026 2:27 AM | Updated on Oct 30 2026 2:27 AM

నారాయణపేట: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎన్‌హెచ్‌ఎం గౌరవ అధ్యక్షుడు బిక్షపతి తెలిపారు. జిల్లాకేంద్రంలోని మున్సిపల్‌ పార్కు వద్ద టీజీ ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు గురువారం 17వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు వైద్యసేవలు అందిస్తూ ఆరోగ్యశాఖలో కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రజలకు వైద్యసేవలు అందించడం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం వంటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న తమ కృషిని ప్రభుత్వం గుర్తించి వెంటనే క్రమబ ద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ప్రసాద్‌, ప్రధానకార్యదర్శి వెంకటరమణ, కోశాధికారి రాఘవేందర్‌, సభ్యులు నర్సింహారావు సగరి, మోనేష్‌చారి, తిరుపతి, శ్రీలత, అర్చన, ఐశ్వర్య, నవ్యదీప్తి, శ్వేతశ్రీ, రామస్వామి, వినోద్‌, గాయత్రి, అజారుద్దీన్‌, ఆశబీ, రామేశ్వరి, అపర్ణ, నాగజ్యోతి, పుష్ప, సుమిత్ర, అలివేలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement