సకాలంలో వైద్యసేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

సకాలంలో వైద్యసేవలు అందించాలి

Oct 30 2026 2:27 AM | Updated on Oct 30 2026 2:27 AM

నారాయణపేట: నైపుణ్య శిక్షణ కార్యక్రమాల ద్వారా ప్రమాద బాధితులకు తక్షణ వైద్యసాయం అందించి విలువైన ప్రాణాలు కాపాడవచ్చని ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ రవికుమార్‌ తెలిపారు. గురువారం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోని సెమినార్‌ హాల్‌లో జీవీకే ఈఎంఆర్‌ఐ సంస్థ ఆధ్వర్యంలో 108 సిబ్బందికి రిఫ్రెషర్‌ శిక్షణ తరగతులు నిర్వహించగా.. నారాయణపేట జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్లు (ఈఎంటీలు), అంబులెన్స్‌ డ్రైవర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర వైద్యసేవల్లో పనిచేసే సిబ్బంది ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఈఎంటీలకు ఆరు రోజులు, అంబులెన్స్‌ డ్రైవర్లకు రెండురోజుల పాటు తరగతులు నిర్వహించారు. జీవీకే ఈఎంఆర్‌ఐ సంస్థ ఈఎంఎల్‌సీ విభాగం శిక్షణ అధ్యాపకురాలు సుమన్‌, పీసీఆర్‌ విభాగం అధికారి వెంకటేష్‌ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగింది. సీపీఆర్‌ నిర్వహణ, ప్రమాద బాధితులను సురక్షితంగా తరలించే విధానాలు, ఆధునిక అంబులెన్‌న్స్‌ పరికరాల వినియోగం, గుండెపోటు, శ్వాసకోశ సమస్యలు తదితర అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే పద్ధతులపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రాక్టికల్‌ నైపుణ్యాలను మెరుగుపర్చడంతో పాటు రోగులకు మెరుగైన సేవలందించేలా శిక్షణ ఇచ్చారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా ప్రజలు అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్‌ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement