గణేష్‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

గణేష్‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

Sep 21 2026 6:53 AM | Updated on Sep 21 2026 6:53 AM

మక్తల్‌: వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. ఆదివారం పట్టణంలోని మినీ ట్యాంకుబండ్‌ దగ్గర నిమజ్జనం చేసే ప్రాంతాన్ని ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 24న వినాయక నిమజ్జనం జరగనుండగా.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. దండు క్రాస్‌, చెరువు దగ్గర లైటింగ్‌, భద్రత, సౌకర్యాలు, బారికేడ్స్‌, వాహనాల రాకపోకలు, పార్కింగ్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పుర కమిషనర్‌, తహసీల్దార్‌ను ఆదేశించారు. శోభాయాత్ర మార్గంలో విద్యుత్‌ తీగలు సరిచేయడంతో పాటు రహదారులపై గుంతలను పూడ్చాలన్నారు. ఆయన వెంట మాజీ మార్కెట్‌ చైర్మన్‌ రవికుమార్‌యాదవ్‌, వాకిటి హన్మంతు తదితరులు ఉన్నారు.

రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి

వాకిటి శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement