నిమజ్జన మార్గాల్లో వాహనాలు, భక్తుల రద్దీ నియంత్రణ, బందోబస్తుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మండపం.. ఊరేగింపు.. నిమజ్జన ఘాట్.. ఇలా ప్రతి దశలోనూ అవసరమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించడంతో పాటు పెట్రోలింగ్ పెంచనున్నారు. కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా పోలీస్ కార్యాలయానికి అనుసంధానం చేశారు. దీంతో మండపాల వద్ద పరిస్థితులను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించే అవకాశం ఉంటుంది. రద్దీ పెరిగినా, ఏదైనా సమస్య తలెత్తినా వెంటనే స్పందించేలా పోలీస్ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది.


