మరో ఏడాది ఆగాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

మరో ఏడాది ఆగాల్సిందే!

Sep 12 2026 1:30 AM | Updated on Sep 12 2026 1:30 AM

వేగవంతం చేస్తున్నాం..

2015లో శంకుస్థాపన..

నాగర్‌కర్నూల్‌: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతం చేయడంలో నిర్లక్ష్యం చేసిందనే విమర్శలున్నాయి. గతేడాది మే నెలలో ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించి 2025 డిసెంబర్‌ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా.. ఇంకా చాలా వరకు పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో ఈ ఏడాది రెండు పంపుసెట్లు ప్రారంభించినా.. కేవలం నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి రెండు టీఎంసీలు ఎత్తిపోసి నిలిపివేశారు. ఏదుల రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేయడానికి ఓపెన్‌ కాల్వ పనులు అసంపూర్తిగా ఉండటమే ఇందుకు కారణం. కుడికిళ్ల, తిర్నాంపల్లి వద్ద దాదాపు 8 లక్షల క్యూబిక్‌ మీటర్ల గట్టి రాయి ఉండటంతో నీరు వదలడానికి వీలు కాలేదని, ప్రస్తుతం రాయి తొలగింపు పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

అసంపూర్తిగా ప్రధాన కాల్వ..

నార్లాపూర్‌ నుంచి ఏదుల మధ్యలో 6.4 కి.మీ., ప్రధాన కాల్వ ఉంది. దాదాపు 40– 25 మీటర్ల వెడల్పు, లోతు ఉంటుంది. కాల్వ తవ్వకాలు జరిగినా కుడికిళ్ల, తిర్నాంపల్లి వద్ద హార్డ్‌ రాక్‌ ఉండటంతో పనుల్లో వేగం తగ్గింది. దాదాపు ఆ రెండు చోట్ల 8 లక్షల క్యూబిక్‌ మీటర్ల రాయి, మట్టి ఉందని అధికారుల అంచనా. గతేడాది మే నెలలో నీటి పా రుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించి కాల్వ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గతేడాది డిసెంబర్‌లోగా పనులు పూర్తి చేస్తే ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో నీళ్లు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించినా.. పనులు కాలేదు. ఇంకా ఓపెన్‌ కాల్వలో కుడికిళ్ల వద్ద హార్డ్‌ రాక్‌తో కాల్వ త వ్వకాలు నెమ్మదించాయి. ఇందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని విమర్శలున్నాయి. తాజాగా పనులు డిసెంబర్‌లో గా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించినా.. ప్రస్తుత పరిస్థితి చూస్తే వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్ట్‌ల సమీక్షకు వచ్చిన తర్వాత పనుల్లో కొంత వేగిరం పెరిగిందనే చెప్పవచ్చు. ఏదేమైనా రిజర్వాయర్లలోకి నీళ్లు వచ్చేది 2027 వానాకాలం సీజన్‌లోనే. అప్పటి వరకు పాలమూరు– రంగారెడ్డి వినియోగంలోకి రాదు. కేవలం నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి మిషన్‌ భగీరథ కోసం ఉపయోగించుకునే విధంగా పనులు జరుగుతున్నాయి. ఇక నార్లాపూర్‌– ఏదుల మధ్య ఓపెన్‌ కాల్వతోపాటు 16 కి.మీ., పొడవు సొరంగం ఉంది. సొరంగం పని దాదాపుగా పూర్తి కాగా.. ముందు భాగంలో 50 మీటర్ల పొడవు పని చేయాల్సి ఉంది. నార్లాపూర్‌ రిజర్వాయర్‌లో ఉన్న వడ్డెర గుడిసెలు, సున్నపుతండా వాసులను ఇటీవల ఖాళీ చేయించారు. వచ్చే ఏడాది నాలుగు రిజర్వాయర్లకు నీళ్లు తరలనున్నాయి.

‘పాలమూరు–రంగారెడ్డి’

నీటికోసం తప్పని నిరీక్షణ

నార్లాపూర్‌– ఏదుల మధ్య

పూర్తి కాని కాల్వ పనులు

దాదాపు 8 లక్షల క్యూబిక్‌ మీటర్ల

మట్టి తొలగింపునకు చర్యలు

డిసెంబర్‌ నాటికి లక్ష్యం నిర్దేశం..

మార్చి వరకు కొనసాగే అవకాశం

ఆ మట్టి తొలిగిస్తేనే ఏదుల

రిజర్వాయర్‌కు సాఫీగా నీరు

నార్లాపూర్‌– ఏదుల రిజర్వాయర్‌ మధ్య ఓపెన్‌ కాల్వలో కుడికిళ్ల, తిర్నాంపల్లి వద్ద ఉన్న రాయిని తొలిగింపు పనులు వేగవంతం చేశాం. డిసెంబర్‌ చివరిలోగా తొలిగింపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించాం. రాయి బ్లాస్టింగ్‌ చేసి లోతు నుంచి బయటకు రాళ్లు తీసుకెళ్లడం కొంత ఇబ్బందిగా ఉంది. కాల్వలో హార్డ్‌ రాక్‌ తొలిగిస్తే నార్లాపూర్‌ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీళ్లు తరలించవచ్చు. ఏదుల నుంచి వట్టెం రిజర్వాయర్‌కు అక్కడి నుంచి కర్వెనకు ఎత్తిపోయడానికి పంపుసెట్లు బిగింపు సైతం పూర్తి అయ్యింది. అన్ని పనులు పూర్తయ్యి.. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో నీళ్లు ఉంటే రిజర్వాయర్‌లోకి తరలించవచ్చు.

– పార్థసారధి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ

ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను 2015లో రూ.35,200 కోట్ల అంచనాలతో అప్పటి సీఎం కేసీఆర్‌ పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌ కింద నార్లాపూర్‌ నుంచి ఏదుల, ఏదుల నుంచి వట్టెం, మరోవైపు ఏదుల నుంచి కర్వెన, అక్కడి నుంచి ఉదండాపూర్‌ రిజర్వాయర్లకు నీళ్లు తరలిస్తారు. ప్రస్తుతం నార్లాపూర్‌, ఏదుల, కర్వెన, వట్టెం రిజర్వాయర్లు దాదాపుగా పూర్తవగా.. ఉదండాపూర్‌ పనులు కొనసాగుతున్నాయి. పంపుహౌస్‌ల్లో మోటార్లు బిగింపు సైతం పూర్తి అయ్యింది. నీళ్లు వస్తే చాలు ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ మినహాయిస్తే మిగతా రిజర్వాయర్లు ఏదుల, వట్టెం, కర్వెన నీటితో కళకళలాడుతూ.. భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement