కాంగ్రెస్‌లో ‘పవర్‌’ గేమ్‌..! | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో ‘పవర్‌’ గేమ్‌..!

Sep 12 2026 1:30 AM | Updated on Sep 12 2026 1:30 AM

అధిష్టానం దృష్టి సారించేనా?

పైకి ఐక్యత.. లోపల ఆధిపత్య పోరు

–8లో u

నారాయణపేట: అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రత్య ర్థి పార్టీలను ఎదుర్కోవాల్సింది పోయి సొంతింటి రాజకీయాలతో సతమతమవుతోందా..? పైకి అంతా ఒక్కటేనని కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం ఆ ధిపత్యం కోసం వర్గాల మధ్య మౌనపోరు సాగుతో ందా..? అన్న చర్చ నారాయణపేట నియోజకవ ర్గ కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారిస్తున్న వేళ పార్టీ కేడర్‌లో మాత్రం ‘ఎవరి మాట నడ వాలి?’ ‘ఎవరి నాయకత్వాన్ని అనుసరించాలి?’ అ న్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. పాత, కొత్త నేతల మధ్య సమన్వయ లోపం, స్థానికంగా పెరుగుతున్న వర్గపోరు, ఒక్కో ప్రాంతంలో ఒక్కో నేత చుట్టూ కేడర్‌ సమీకరణ.. పేట కాంగ్రెస్‌లో పవర్‌ గేమ్‌ కొత్త మలుపు తిరుగుతోందన్న సంకేతాలిస్తున్నాయి.

వన్‌మ్యాన్‌ షో.. కేడర్‌లో గుబులు...

పైకి అంతా సజావుగానే ఉందని కనిపిస్తున్నా.. లో లోపల అంతర్గత రాజకీయాలు కేడర్‌లో కలకలం రేపుతున్నాయన్న చర్చ సాగుతోంది. ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ సరైన సమయంలో అందుబాటులో లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు, స్థానిక వ్యవహారాల్లో ఎమ్మెల్యే బంధువు ఆధిపత్యం పెరుగుతోందన్న భావన కొందరు నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తికి కారణమవుతోందని తెలుస్తోంది. తన మాటే శాసనం అన్న శైలిలో ముందుకు సాగుతున్నారన్న చర్చ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వినిపిస్తోంది.

● నారాయణపేట నియోజకవర్గంలో అంతర్గత రాజకీయాలు కేడర్‌లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. పాత నేతలకు ఓ రకమైన ప్రాధాన్యం.. కొత్త నేతలకు మరోరకమైన రాజకీయ స్పేస్‌ దక్కుతోందన్న భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతో ంది. పైకి నేతలంతా ఐక్యంగా కనిపిస్తున్నా.. స్థాని కంగా ఎవరి మాట చెల్లాలి? ఎవరి నాయకత్వాన్ని కేడర్‌ అనుసరించాలి? అన్నదే అసలు పంచాయితీగా మారిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

మండలానికో ముఠా.. నేతకో వర్గం..!

నారాయణపేట నియోజకవర్గ కాంగ్రెస్‌లో మండలాలు, గ్రామాల వారీగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. నారాయణపేట మండలంలోని జలాల్‌పూర్‌, జాజాపూర్‌, తిర్మలాపూర్‌ గ్రామాల నేతలకు ప్రాధాన్యమిస్తూ పదువులు కేటాయించడం, ఇతర గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పార్టీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ధన్వాడలోనూ స్థానికంగా ఓ వర్గం మాటే చెల్లుతోందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. దీంతో పేట నుంచి ధన్వాడ వరకు కాంగ్రెస్‌లో స్థానిక సమీకరణాలు మారుతున్నాయా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. పాత, కొత్త నాయకుల మధ్య పెరుగుతున్న దూరం.. స్థానిక వ్యవహారాల్లో ఆధిపత్యం కోసం సాగుతున్న ప్రయత్నాలు పార్టీలో అంతర్గత చర్చకు దారితీస్తున్నాయి. పైకి అంతా ఐక్యంగా కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరి బలం ఎంత? ఎవరి మాట ఎంతవరకు చెల్లుతుంది? అన్నదే కొత్త రాజకీయ లెక్కలకు కేంద్రబిందువుగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే స్థానిక స్థాయిలో వర్గపోరు పెరగకుండా నాయకత్వం సమన్వయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. చిన్న చిన్న విభేదాలు పెద్ద రాజకీయ దూరంగా మారకముందే నాయకత్వం జోక్యం చేసుకుని అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలన్న డిమాండ్‌ కేడర్‌లో వినిపిస్తోంది. బయట కాంగ్రెస్‌ ఒక్కటే.. లోపల మాత్రం ఎవరి పెత్తనం అన్నదే పేట రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

పాత నేతలకో మాట..

కొత్త నేతల రూటు సపరేటు

అంతర్గత కుమ్ములాటలతోనే

ప్రతిపక్షాలకు బలం

ఇది పేట నియోజకవర్గంలోని పరిస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement