విధుల్లో అప్రమత్తత అవసరం : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

విధుల్లో అప్రమత్తత అవసరం : ఎస్పీ

Sep 12 2026 1:30 AM | Updated on Sep 12 2026 1:30 AM

నారాయణపేట: వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యే వరకు పోలీసు సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ డా. వినీత్‌ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో బందోబస్తు ఏర్పాట్లు, విధుల కేటాయింపు, భద్రతా చర్యలపై ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. అత్యవసర పరిస్థితులు మినహా నిమజ్జనం పూర్తయ్యే వరకు సిబ్బందికి సెలవులు ఉండవని.. ప్రతి ఒక్కరూ హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉంటూ ఎలాంటి పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూ చించారు. ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసులు సివిల్‌ పోలీస్‌ విభాగానికి వెన్నముకలాంటి వారని.. సమన్వయం, సమాచార మార్పిడి, టీమ్‌ వర్క్‌తో బందోబస్తు విధులు నిర్వహించాలన్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలతో మర్యాదగా, సంయమనంతో వ్యవహరించాలని తెలిపారు. విధుల్లో ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులను సిబ్బందిని అడిగి తెలుసుకు న్న ఎస్పీ.. సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సిబ్బంది సంక్షేమానికి పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని హా మీ ఇచ్చారు. గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ నియంత్రణ, బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజల భద్రతే పోలీస్‌శాఖ ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ఎండీ రియాజ్‌ హుల్‌హక్‌, డీఎస్పీ మహేష్‌, ఆర్‌ఐ విజయభాస్కర్‌, ఎస్‌బీ ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి, ఆర్‌ఎస్‌ఐలు శివశంకర్‌, శ్వేత, శిరీష, శివయ్య, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement