విద్యుత్‌ బిల్లుల వసూళ్లపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ బిల్లుల వసూళ్లపై దృష్టి

Sep 12 2026 1:30 AM | Updated on Sep 12 2026 1:30 AM

నారాయణపేట: ప్రతి నెల పట్టణానికి నిర్దేశించిన డిమాండ్‌కు అనుగుణంగా 100 శాతం వసూళ్లు సాధించేలా ప్రత్యేక దృష్టి సారించాలని విద్యుత్‌శాఖ డీఈ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రలోని విద్యుత్‌శాఖ సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో బిల్లుల వసూలు, విద్యుత్‌ సరఫరా, పెండింగ్‌ సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. బిల్లుల వసూలులో వెనుకబడిన ప్రాంతాలు, పెండింగ్‌లో ఉన్న సర్వీసులపై శ్రద్ధ చూపాలని, సరఫరాలో అంతరా యం తలెత్తకుండా ముందస్తు చర్యలు చేప ట్టాలని సూచించారు. ఎక్కడైనా సరఫరా నిలి స్తే సమస్యను వేగంగా గుర్తించి పునరుద్ధరించాలని.. వినియోగదారులకు అధికారులు,సి బ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. ఏడీ ప్రదీప్‌, ఏఈ మహేష్‌గౌడ్‌ పాల్గొన్నారు.

‘పది’లో ఉత్తమ

ఫలితాలే లక్ష్యం : డీఈఓ

నారాయణపేట ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపు, నాణ్యమైన విద్య అందించి రాబోయే 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గ్రౌండ్‌)లో మండల ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించి శాలువాతో సన్మానించి మాట్లాడారు. ఉత్తమ ఉపాధ్యాయులు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. అనంతరం ఎంఈఓ బాలాజీ మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు ఇదే స్ఫూర్తితో మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారి నాగార్జున్‌రెడ్డి, సీఎంఓ రాజేందర్‌కుమార్‌, జిల్లా సైన్స్‌ అధికారి భానుప్రకాష్‌, స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు శిశికుమార్‌, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తగ్గిన లడ్డు పరిమాణం.. కేసు నమోదు

చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయంలో భక్తులకు అందించే లడ్డు ప్రసాదం తయారీ కేంద్రంలో శుక్రవారం తూనికల అధికారులు తనిఖీలు నిర్వ హించారు. లడ్డు పరిమాణం తక్కువగా ఉందని నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా తూనికల జిల్లా అధికారి రవీంద ర్‌ మాట్లాడుతూ లడ్డూల తయారీలో అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.కురుమూర్తిస్వామి ఆలయం వద్ద భక్తు లకు అందించే లడ్డు పరిమాణం 100 గ్రాములకు గాను 80 గ్రాములు మాత్రమే ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement