నారాయణపేట: ప్రభుత్వం హామీల అమలుకు కాలయాపన చేస్తే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆగ్రహా న్ని చవిచూడాల్సి వస్తుందని.. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో 18వ తేదీ తర్వాత మరోసారి ఉద్యమాన్ని కొనసాగిస్తామని టీఎస్ పీఆర్‌ర్టీయూ జిల్లా అధ్యక్షుడు వై.జనార్దన్‌న్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి పి.వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం మరికల్‌లోని జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, ఉర్దూ మీడియం పాఠశాలతో పాటు కన్మనూర్, పెద్దచింతకుంట, ఎంపీ యూపీఎస్ తీలేరు, ఎంపీపీఎస్ మరికల్ పాఠశాలల్లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం చర్చలకు ముందుకురావడంతో గురువారం హైదరాబాద్‌లో చేపట్టాల్సిన మహాధర్నాను వాయిదా వేసినట్లు తెలిపారు. ఇకనైనా కాలయాపన చేయకుండా వారం రోజుల్లో పీఆర్సీ నివేదిక తీసుకొచ్చి 51 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారని అభినందించారు.ఈ నెల 18 లోగా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఉద్యమాన్ని తిరిగి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు యు.రవికుమార్, పీఆర్టీయూ సభ్యులు రవీందర్‌రెడ్డి, మధుసూదనన్, రాంరెడ్డి, మండల అధ్యక్షుడు ఎస్.నవీన్‌కుమార్, ప్రధానకార్యదర్శి ముస్తఫా, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గోపాల్‌రెడ్డి, గోవర్ధనన్‌గౌడ్, అమ్రేష్, విజయకృష్ణ, పద్మ, రాంరెడ్డి, శ్రీనివాస్, మహ్మద్ ఖాజా, అంజయ్య, వెంకట్‌రెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు.


