చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణలో మంత్రి వాకిటి శ్రీహరి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు
మక్తల్: నిజాం భూస్వాములకు వ్యతిరేకంగా భూ మి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహ రి అన్నారు. గురువారం రాత్రి పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్‌్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి షాద్‌నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్‌తో కలిసి ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళ అయి ఉండి తొలి భూ పోరాటానికి నాంది పలికిందని, ధైర్యసాహసాలతో పోరాటం చేసిన ఘనత ఐలమ్మకే దక్కిందన్నారు. ఆమె జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా రజక సంఘం మంత్రికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు, హాస్టళ్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, దోబీలకు యంత్రాలు ఇవ్వాలని విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేను నిర్వాహకులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ టీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, పుర చైర్‌పర్సన్ వాకిటి మానస హన్మంతు, బీజేపీ కార్యవర్గసభ్యు డు కొండయ్య, జిల్లా రజక సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, కౌన్సిలర్లు రాజశేఖర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మల్లికార్జున్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కోళ్ల వెంకటేష్, రజక సంఘం అధ్యక్షుడు హన్మంతు, కట్టా సురేష్, రవికుమార్, నర్సింహులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


