కబడ్డీ.. కబడ్డీ.. | - | Sakshi
Sakshi News home page

కబడ్డీ.. కబడ్డీ..

Aug 10 2026 1:40 AM | Updated on Aug 10 2026 1:40 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ నిర్వహించనున్నారు. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ 8వ ఎడిషన్‌ క్రీడలను ఈ సారి తెలంగాణలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఇటీవల కాలంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. క్రీడాభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ప్రత్యేక క్రీడాపాలసీ రూపొందించింది. గత ఏడాది సీఎం కప్‌ క్రీడలను గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఎంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ను రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో ఏదైనా ఒక క్రీడను మహబూబ్‌నగర్‌లో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ మేరకు మహబూబ్‌నగర్‌లో ఖేలో ఇండియా యూత్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరో రెండు లేదా మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌ నగరంలోని మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియంలో కబడ్డీ పోటీలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన బాలురు ఎనిమిది, బాలికలు ఎనిమది జట్లతో కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలు నవంబర్‌లో జరిగే అవకాశాలు ఉన్నాయి.

విజయవంతంగా నిర్వహిస్తాం

హబూబ్‌నగర్‌లో ఖేలో ఇండియా కబడ్డీ పోటీలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి కృషితో మహబూబ్‌నగర్‌లో ఖేలో ఇండియా కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరిలకు జిల్లా క్రీడారంగం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అన్ని క్రీడాసంఘాలు, సీనియర్‌ క్రీడాకారుల సహకారంతో ఖేలో ఇండియా కబడ్డీ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తాం. – జె.రాజశేఖర్‌రెడ్డి, డీవైఎస్‌ఓ

పాలమూరులో ఖేలో ఇండియా కబడ్డీ పోటీలు

రెండు, మూడు రోజుల్లో

రానున్న అధికారిక ప్రకటన

ఎనిమిది రాష్ట్రాల

బాలబాలికల జట్లతో చాంపియన్‌షిప్‌

నవంబర్‌లో నిర్వహించే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement