భూ నిర్వాసితులకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

భూ నిర్వాసితులకు అండగా ఉంటాం

Aug 10 2026 1:40 AM | Updated on Aug 10 2026 1:40 AM

మదనాపురం: రైల్వేలైన్‌ విస్తరణలో భూములు కోల్పోయిన ప్రతి రైతుకు ప్రభుత్వాలు అండగా నిలుస్తాయని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. మండల కేందరంతో పాటు మండలంలోని కొన్నూరు, నర్సింగాపురం, ద్వారకనగర్‌ గ్రామాల్లో మొత్తం 125 మంది రైతులు రైల్వే లైన్‌ విస్తరణలో భూములు కోల్పోగా.. ఆదివారం కొన్నూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వారికి రూ.3,73,91,502 నష్ట పరిహారం చెక్కులను అందజేసి మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణానికి, ప్రాంతీయ అభివృద్ధికి భూములు త్యాగం చేసిన రైతుల రుణం తీర్చుకోలేనిదని కొనియాడారు. భూమి కోల్పోయిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా తగిన పరిహారం చెల్లించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రసూల్‌బీ, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్‌

ఎంపీ డీకే అరుణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement