ఇటీవల ఖేలో ఇండియా కేంద్రం, రాష్ట్ర బృందా లు మహబూబ్‌నగర్‌లోని మెయిన్ స్టేడియంతో పాటు ఇతర చోట్ల క్రీడా మౌలిక సదుపాయాలను సమగ్రంగా పరిశీలించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అమర్‌జ్యోతి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్ట ర్లు డాక్టర్ రవితేజ, రవీందర్, ఎస్.శ్రీనివాస్‌లతో కూడిన బృందం ఇండోర్ స్టేడియం, క్రీడాకారుల వసతి సౌకర్యాలు, ప్రాక్టీస్ చేయడానికి మైదానా లు, జిల్లాకేంద్రంలోని హోటళ్లలో అందుబాటులో ఉన్న వసతి సదుపాయాలు, స్థానిక బోయపల్లి శివారులోని తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షి యల్‌లో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.


