ఓటరు మ్యాపింగ్‌లో స్థానికంగా లేని వారి ఓట్లు తీయాల్సి వస్తుందని అనుకున్నాం. ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చిన తర్వాత గ్రామం విడిచి వెళ్లిన వారు, ఉద్యోగ నిమిత్తం వెళ్లిన వారు ఫోన్లు చేసి వివరాలు చెబుతున్నారు. కొందరు స్వయంగా గ్రామానికి వచ్చి ఫారాలు నింపి ఇస్తున్నారు.
– ఆప్పోజు పద్మ, బీఎల్‌ఓ, ఉప్పునుంతల
పుట్టిన ఊర్లో ఉండాలని..
నేను ఇతర ప్రాంతాల్లో ఉంటున్నా. ఊరిలో ఏ కార్యక్రమం జరిగినా వస్తుంటాం. అక్కడ ఓ టు వద్దని.. ఇక్కడే ఉంచుకున్నా. ఏ ఎన్నిక వచ్చినా సొంత ఊరుకు వచ్చి ఓటు వేయడం ఇష్టం. అందుకోసం ఎన్యూమరేషన్ ఫారం నింపి వెళ్లాను. మా ఓటు మా ఊరిలో ఉంటేనే ఆనందం. – కట్టా జనార్దన్‌రెడ్డి, ఉప్పునుంతల


