ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ వేగవంతం | - | Sakshi
Sakshi News home page

ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ వేగవంతం

Jul 23 2026 1:42 AM | Updated on Jul 23 2026 1:42 AM

నారాయణపేట: పేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై బుధవారం ఆర్డీఓ రమేష్‌ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌న్‌లో పురోగతిని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆర్డీఓ వివరించారు. మొత్తం 2,42,773 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటి వరకు 1,88,944 మంది ఓటర్ల డిజిటలైజేషనన్‌ పూర్తయిందని వివరించారు. యూఈఎఫ్‌లతో కలిపి మొత్తం 84.78 శాతం దరఖాస్తుల పరిశీలన ముగిసిందని.. ఇంకా 36,944 దరఖాస్తుల పరిశీలన పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. మిగిలిన ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డిజిటలైజేషనన్‌ను సకాలంలో పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు.

వినియోగదారుల చెంతకే బ్యాంకు సేవలు

నారాయణపేట: వినియోగదారుల అవసరాలను నేరుగా తెలుసుకొని మెరుగైన బ్యాంకింగ్‌ సేవలు అందించాలనే లక్ష్యంతో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ‘షాప్‌ టు షాప్‌’ కార్యక్రమం నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని కస్టమర్‌ సర్వీస్‌ ఎక్సలెన్‌న్స్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం నారాయణపేటలోని వ్యాపార సంస్థలు, దుకాణాలను స్థానిక బ్రాంచి మేనేజర్‌ బి.నర్సప్ప సిబ్బందితో కలిసి సందర్శించారు. వ్యాపారులు, వినియోగదారులతో నేరుగా మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు. బ్యాంకు ద్వారా అందించే పొదుపు, కరెంట్‌ ఖాతాలు, వ్యక్తిగత, గృహ, ఎంఎస్‌ఎంఈ, వ్యవసాయ రుణాలు, డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు, బీమా, పెట్టుబడి పథకాలు తదితర సేవలపై అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. సురక్షితమైన, సులభమైన డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలను వినియోగించుకోవాలని ఖాతాదారులకు సూచించారు. కార్యక్రమంలో బ్యాంకు శాఖ మేనేజర్లు, అధికారులు, క్లరికల్‌, సబార్డినేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

బీసీ స్టడీ సర్కిల్‌లో

ఉచిత శిక్షణ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాకేంద్రంలోని బీసీ స్టడీసర్కిల్‌లో గ్రూప్స్‌, ఆర్‌ఆర్‌బీ, ఎస్సెస్సీ, బ్యాకింగ్‌ వంటి పోస్టులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి విష్ణునందన్‌, స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల నారాయణపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వచ్చే నెల14లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. గతంలో శిక్షణ పొందిన వారు అనర్హులని, మరింత సమాచారం కోసం 74167 31371 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

సమాజ సేవలో

పీయూ ముందుంటుంది

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: సమాజ సేవలో పీయూ ముందుంటుందని వీసీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ధర్మాపూర్‌లో పీయూఎంఎస్‌డబ్ల్యూ విభాగం, ఎస్వీఎస్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్త వహించేందుకు పీయూ తనవంతుగా సేవలు అందిస్తుందన్నారు. ఎక్కడికో వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోకుండా గ్రామానికి వచ్చిన వైద్యులతో పరీక్షలు చేయించుకుని మందులు తీసుకోవాలని కోరారు. ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థులు పుస్తక విజ్ఞానంతోపాటు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని, కార్యక్రమాన్ని నిర్వహించిన అధ్యాపకులు, విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో రి జిస్ట్రార్‌ రమేష్‌బాబు, సర్పంచ్‌ రాజుగౌడ్‌, డాక్టర్లు పవన్‌కుమార్‌, సింధు, మణికంఠరాజు, ఆప్రీన్‌, విజయ, అంజని, మనోహర్‌, అధ్యాపకుడు గాలెన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement