పారదర్శక సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

పారదర్శక సేవలు అందించాలి

Jul 23 2026 1:42 AM | Updated on Jul 23 2026 1:42 AM

నిరంతర బందోబస్తు..

నారాయణపేట: పోలీస్‌స్టేషనన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే నమోదు చేసి నిర్దిష్ట సమయంలో విచారణ పూర్తిచేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ డా. వినీత్‌ ఆదేశించారు. బుధవారం నారాయణపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌న్‌లోని అన్ని విభాగాలను పరిశీలించి రికార్డులు, పెండింగ్‌ పిటిషన్లు, కేసుల దర్యాప్తు, పురోగతి, సిబ్బంది విధుల నిర్వహణపై సమీక్షించారు. ప్రతి పిటిషనన్‌కు సంబంధించిన వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని, పెండింగ్‌లో ఉన్న వాటికి కారణాలను రికార్డుల్లో పొందుపర్చాలని ఆదేశించారు. పిటిషన్లను అనవసరంగా పెండింగ్‌లో ఉంచితే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడంతో పాటు పోలీస్‌శాఖపై నమ్మకం మరింత పెరిగేలా సిబ్బంది విధులు నిర్వర్తించాలని సూచించారు.

స్టేషన్‌లో నమోదయ్యే ప్రతి కేసు వివరాలను సీసీటీఎనన్‌ఎస్‌ ఆన్‌లైనన్‌్‌ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, ఎలాంటి కేసు ఎంట్రీ పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా రసీదు అందజేయాలని, ఎఫ్‌ఐఆర్‌ నమోదైన వెంటనే ఉచితంగా కాపీ ఇవ్వాలని సూచించారు. అవసరమైన చోట ఆన్‌సైట్‌ ఎఫ్‌ఐఆర్‌ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యతని .. స్టేషనన్‌ పరిధిలో నిరంతర పెట్రోలింగ్‌ నిర్వహించాలని ఎస్పీ సూచించారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా, రాత్రివేళల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. రోజు విధులు ప్రారంభానికి ముందు రోల్‌కాల్‌ నిర్వహించి సిబ్బందికి విధుల కేటాయింపు, చట్టాలు, క్రమశిక్షణ, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించే విధానంపై సూచనలు ఇవ్వాలన్నారు. పోలీసులు క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతాయుతమైన విధి నిర్వహణ పాటిస్తూ ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ నల్లపు లింగయ్య, టౌన్‌ సీఐ శివశంకర్‌, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement