‘మధ్యాహ్నం’లో ఇష్టారాజ్యం..! | - | Sakshi
Sakshi News home page

‘మధ్యాహ్నం’లో ఇష్టారాజ్యం..!

Jul 23 2026 1:42 AM | Updated on Jul 23 2026 1:42 AM

గుడ్డుకు బదులు అరటిపండు..

మెనూ పాటించకుంటే చర్యలు..

విద్యార్థులు గైర్హాజరు..

భోజన లెక్కల్లో మాత్రం హాజరు?

బోర్డుకే పరిమితమైన మెనూ

కలెక్టర్‌ చర్యలు తీసుకున్నా..

మారని తీరు!

–8లో u

నారాయణపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కు అందించాల్సిన మధ్యాహ్న భోజన పథకం మె నూ గాడి తప్పుతోంది. పాఠశాలల్లో రోజూ నిర్ణ యించిన మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉన్నప్పటికీ కొన్నిచోట్ల వంట ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పాఠశాలకు విద్యార్థులు రాకపోయినా.. వారి పేర్లతో భోజనం వండినట్లు లెక్కలు చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని 466 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 52,188 మంది విద్యార్థులు చదువుతుండగా.. రోజువారీగా సగటున 85 శాతం మంది మాత్రమే హాజరవుతున్నట్లు అధికా రుల గణాంకాలు చెబుతున్నాయి. విద్యార్థుల హాజ రును బట్టి బియ్యం కొలతలు వంట ఏజెన్సీలకు ఇస్తున్నప్పటికీ.. కొన్ని పాఠశాలల్లో మాత్రం గైర్హాజరైన విద్యార్థులకూ భోజనం వండినట్లు లెక్కలు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

రోజుకు 40 క్వింటాళ్లు..

విద్యార్థుల భోజనానికి అవసరమైన బియ్యాన్ని ముందుగానే పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. రోజుకు 40 క్వింటాళ్ల వరకు బియ్యం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఎంతమంది విద్యార్థులు భోజనం చేశారు? ఎంత బియ్యం వండారు? ఎంత మిగిలింది? అనే లెక్కలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

పర్యవేక్షణ కరువు..

మధ్యాహ్న భోజన సమయంలో మండల విద్యాశాఖ అధికారులు, సెక్టోరియల్‌ అధికారులు, హెచ్‌ఎంలు, జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షించాల్సి ఉన్నా.. పలుచోట్ల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో వంట ఏజెన్సీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థుల హాజరు, బియ్యం వినియోగం, వంట చేసిన పరిమాణంపై అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

మధ్యాహ్న భోజనం బుధవారం మెనూలో అన్నం, మిక్స్‌డ్‌ వెజిటేబుల్‌ కర్రీతో పాటు గుడ్డు ఇవ్వాలి. కానీ గుడ్డు ధర పెరిగిందని చెప్పి గుడ్డుకు బదులుగా అరటిపండు ఇచ్చారు. అంతేకాకుండా అన్నంలో అప్పుడప్పుడు పురుగులు కూడా వస్తున్నాయి. భోజనం నాణ్యతపై అధికారులు దృష్టి సారించాలి.

– శ్రీనివాస్‌, 9వ తరగతి విద్యార్థి,

జడ్పీహెచ్‌ఎస్‌ దామరగిద్ద

ప్రభుత్వ నిబంధనల ప్రకారం మధ్యాహ్న భోజనం వండి విద్యార్థులకు వడ్డించకపోతే చర్యలు తప్పవు. ఎంఈఓలు, జీహెచ్‌ఎంలు, హెచ్‌ఎంలు, సెక్టోరియల్‌ అధికారులు పర్యవేక్షిస్తూ పరిశీలించాలి. వారంలో ఒక రోజు ఏదేని స్కూల్‌కు వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తా. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వంట ఏజేన్సీలకు ఆదేశిస్తాం. ఎలాంటి పొరపాట్లు జరిగిన వారిపై చర్యలు తీసుకుంటాం.

– గోవిందరాజు, జిల్లా విద్యాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement