చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి ఆశీస్సులు రాష్ట ప్రజలపైన ఎల్లప్పుడు ఉండాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఆయన చిన్నచింతకుంట మండలం అమ్మాపురం కురుమూర్తి స్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన పంచాంగ శ్రావణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కురుమూర్తిస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేశారని వివరించారు. స్వామి వారి ఆశీస్సులు ముఖ్యమంత్రి, రాష్ట ప్రజలపైన ఉండాలన్నారు. కార్యక్రమంలోఅరవింద్‌కుమార్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్లు ప్రశాంత్‌కుమార్, కథలప్ప, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, సర్పంచ్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు.


