నారాయణపేట రూరల్: జిల్లాకేంద్రంలోని సింగార్‌బేస్ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ 3న సాయంత్రం 6 గంటలకు హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు హిందూ సమ్మేళన కార్యక్రమ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు గుంపు బాలరాజు తెలిపారు. గురువారం కార్యక్రమ నిర్వహణపై కమిటీ సభ్యులు పట్టణంలో ప్రత్యేక సమావేశమయ్యారు. పట్టణంలోని పది ఉప బస్తీల నుంచి ఆధ్యాత్మిక భజన సంకీర్తనలతో కాలినడకన హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో ముందుగా యజ్ఞ కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు, వక్త సందేశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో హిందువులు అధికసంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. అంతకుముందు ఆత్మీయ హిందూ సమ్మేళన కార్యవర్గాన్ని పాలమూరు జిల్లా సహ కార్యవాహ మ్యాడం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గుంపు బాలరాజు, ఉపాధ్యక్షులుగా దత్తు చిల్లాల్, రాజ్కుమార్ దోత్రే, వినోద్, విజయలక్ష్మి, కొండోళ్ల రాములు, కార్యదర్శిగా యశ్వంత్, సహ కారదర్శులుగా ఉదయ్‌కుమార్, చిన్న రఘు, కిరణ్, మరికొందరిని సభ్యులుగా ఎన్నుకున్నారు.


