ఆర్డీఓగా శిక్షణ కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్డీఓగా శిక్షణ కలెక్టర్‌

Mar 14 2026 8:36 AM | Updated on Mar 14 2026 8:36 AM

నారాయణపేట: ఆర్డీఓగా శిక్షణ కలెక్టర్‌ కె.ప్రణయ్‌కుమార్‌ 5 వారాల కాలపరిమితికిగాను శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెవెన్యూ డివిజన్‌లో మౌలిక వసతుల పర్యవేక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కాగా రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, మండల అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.

శనగ క్వింటా రూ.5,209

నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం శనగలు క్వింటా గరిష్టంగా రూ.5,209, కనిష్టంగా రూ.5,101 ధర పలికింది. అదేవిధంగా వేరుశనగ గరిష్టంగా రూ.7,889, కనిష్టంగా రూ.3,425, ఆలసందలు గరిష్టంగా రూ.6,091, కనిష్టంగా రూ.4,012, ఎర్ర కంది గరిష్టంగా రూ.8,050, కనిష్టంగా రూ.4,291, తెల్ల కంది గరిష్టంగా రూ.7,309, కనిష్టంగా రూ.7,021 ధరలు లభించాయి.

వేరుశనగ క్వింటా రూ.8.519

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.8,519, కనిష్టంగా రూ.4,001 ధరలు లభించాయి. అదేవిధంగా కందులకు రూ.5,889, జొన్నలు రూ.5,273, పెబ్బర్లు రూ.4,850, ఆముదాలు రూ.6,144, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,840, కనిష్టంగా రూ.1,631, ధాన్యం హంస రూ.1,891, ఆర్‌ఎన్‌ఆర్‌ రూ.2,051 ధరలు పలికాయి.

తొలిసారి

‘నల్లమల’కు గవర్నర్‌

మన్ననూర్‌: శ్రీశైలం క్షేత్రానికి రోడ్డు మార్గాన వెళ్తున్న రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాకు శుక్రవారం మన్ననూర్‌ మృగవాణి అతిథిగృహం వద్ద కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీస్‌ గౌరవ వందనం సమర్పించారు. రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఈ ప్రాంతానికి వచ్చిన ఆయన.. కలెక్టర్‌, ఇతర అధికారులతో ఈ ప్రాంతం విశేషాలు, ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. అతిథిగృహంలో ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుని శ్రీశైలం క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు.

సీపీఎస్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): సీపీఎస్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ యూనియన్‌ పని చేస్తోందని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా నూతన సభ్యత్వ నమోదు ప్రక్రియ జరుగుతుందని, పాలమూరు జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ప్రతి ఉద్యోగిని సంఘంలో భాగస్వామిని చేస్తూ హక్కుల పోరాటంలో ఏకం చేయాలని పిలుపునిచ్చారు. డీఏ బకాయిలు ఏకకాలంలో అన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో జాప్యం చేయడం తగదని, పెండింగ్‌ బకాయిల కోసం అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ ఈహెచ్‌ఎస్‌ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు అత్యంత కీలకమైన ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని సీపీఎస్‌ ఉద్యోగులకు రిటైర్మెంట్‌ తరువాత పెన్షనర్‌ ఐడీలను కల్పిస్తూ, కంట్రిబ్యూషన్‌ లేని హెచ్‌ఎస్‌ను అమలు చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు చంద్రకాంత్‌ మాట్లాడుతూ సీపీఎస్‌ ఉద్యోగుల ప్రయోజనాల రక్షణే ధ్యేయంగా సంఘం పనిచేస్తుందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌ రెడ్డి, కోశాధికారి రాఘవేంద్ర రాష్ట్ర సాహిత్య కమిటీ వెంకటేష్‌ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశ్‌,రాజేష్‌, నరేష్‌, రాగవేందర్‌ రావు, కర్నయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement