నారాయణపేట రూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు శుక్రవారం ముగిశాయి. చివరిరోజు జిల్లాలోని 15 పరీక్ష కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రసాయన శాస్త్రం, కామర్స్ పరీక్షలు జరుగగా 4,143 మంది విద్యార్థులకుగాను 4,058 మంది హాజరుకాగా 85 మంది గైర్హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 3,179 మందికిగా ను 3,124 మంది హాజరుకాగా 51 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా ఒకేషనల్ విద్యార్థులు 964 మందికిగాను 934 మంది పరీక్ష రాయగా 34 మంది హాజరుకాలేదు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్, ఫ్ల యింగ్ స్కాడ్ బృందాలు తనిఖీ చేశాయి. పరీక్షలు విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన సిబ్బందికి డీఐఈఓ సుదర్శన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇంటిబాట పట్టిన విద్యార్థులు..
జిల్లావ్యాప్తంగా వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులతో పాటు కేజీబీవీ బాలికలు పరీక్షలు పూర్తి కావడంతో ఇంటిబాట పట్టారు. పరీక్ష ముగిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులు కళాశాలలకు వచ్చి విద్యార్థుల లగేజీతో వెంటబెట్టుకొని వెళ్లారు.


