‘పుర’ రిజర్వేషన్లు ఖరారు
నారాయణపేట: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు బుధవారం సీడీఎంఏ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని కోస్గి, మద్దూరు, మక్తల్, నారాయణపేట మున్సిపాలిటీల్లో 2011 జనాభా ప్రాతిపదికన ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ స్థానాలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఏ వార్డుకు ఏ రిజర్వేషన్ కేటాయిస్తారనేది స్పష్టత రానుంది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ స్థానాల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. అయితే మూడు మున్సిపాలిటీల్లో ఒక్కొక్క స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. మద్దూర్ మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళకు రెండు వార్డులను రిజర్వు చేశారు. నాలుగు మున్సిపాలిటీల్లో 72 వార్డులకు గాను ఎస్టీ జనరల్ 4, ఎస్టీ మహిళ 1, ఎస్సీ జనరల్ 6, ఎస్సీ మహిళకు 4, బీసీ జనరల్‌కు 12, బీసీ మహిళకు 9, జనరల్‌కు 14, జనరల్ మహిళకు 22 స్థానాలు కేటాయించారు. 72 స్థానాల్లో మహిళలకు 36 స్థానాలు దక్కనున్నాయి. అత్యధికంగా జనరల్ మహిళ స్థానాల్లోనే 22 మందికి అవకాశం కల్పించనున్నారు.
‘పుర’ రిజర్వేషన్లు ఖరారు


