జీవశాస్త్రంలో ప్రయోగాలపై దృష్టి.. | - | Sakshi
Sakshi News home page

జీవశాస్త్రంలో ప్రయోగాలపై దృష్టి..

Mar 5 2026 8:42 AM | Updated on Mar 5 2026 8:42 AM

జీవశాస్త్రంలో ప్రయోగాలపై దృష్టి.. అభ్యాస దీపిక.. సన్నద్ధత...

పర్యావరణం, సాంకేతికత అంశాలను దృష్టిలో ఉంచుకొని జీవశాస్త్రం ప్రశ్నలు రూపొందిస్తారు. ముఖ్యంగా పట్టికలను నేర్చుకొని ప్రయోగాలపై పట్టు సాధిస్తే మంచి మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి పాఠంలోని అంశాలు, నిర్దిష్ట శీర్షిక కింద ఇచ్చిన భావనలు, బొమ్మలు, చార్టులు, కృత్యాలను నేర్చుకోవాలి. పాఠ్యాంశంలో అంతర్భాగంగా ఇచ్చిన సమాచారాన్ని నేర్చుకొని ఆవాహన చేసుకుంటే అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయవచ్చు. సెక్షన్‌–3లో తప్పకుండా ప్రయోగం వస్తుంది.

ఎన్‌సీఈఆర్టీ రూపొందించిన అభ్యాస దీపిక విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి భావనను రెండుసార్లు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. అవసరమైన చోట పట్టికలు, బొమ్మలు గీసి భాగాలను తప్పకుండా రాయాలి. పార్ట్‌–బిలో జతపర్చడం, తప్పు వాక్యాన్ని గుర్తించడం, భిన్నమైన వాటిని ఎంపిక చేయడం, వరుస క్రమంలో అమర్చడం, ఫ్లో చార్టులు, బొమ్మల భాగాలు తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

– సంతోష్‌కుమార్‌, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల,

Advertisement
 
Advertisement
Advertisement