గుడ్డెందొడ్డి.. అప్‌గ్రేడ్‌ | - | Sakshi
Sakshi News home page

గుడ్డెందొడ్డి.. అప్‌గ్రేడ్‌

Mar 5 2026 8:42 AM | Updated on Mar 5 2026 8:42 AM

రిజర్వాయర్‌ సామర్థ్యం 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంపు

అనుమతులు వచ్చాయి..

గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ను 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సర్వే పన ులు మొదలుపెట్టాం. ఇందుకోసం రూ.16 లక్షలు విడుదలయ్యాయి. పనులు వేగవంతంగా పూర్తిచేసి ఈ నెల చివరి నాటికి ప్రభుత్వానికి డీపీఆర్‌ను సమర్పిస్తాం.

– రహీముద్దీన్‌, ఇరిగేషన్‌ శాఖ ఎస్‌ఈ

గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కింద 9 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. ప్రతి ఏడాది వానాకాలం ఖరీఫ్‌ సీజన్‌లో ఈ ప్రాజెక్టుల కింద సాగయ్యే ఆయకట్టుకు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. కానీ, ఇదే ప్రాజెక్టుల కింద రబీ సీజన్‌లో మాత్రం ఆయకట్టుకు నీటి కష్టాలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో ఉన్న గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందుకు సంబంధించి రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపునకు సంబంధించిన సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరుకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నారు. దీంతో ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టుల కింద రబీ సీజన్‌లో సాగయ్యే ఆయకట్టుకు సాగునీటి కష్టాలు తొలగనున్నాయి.

120 రోజులపాటు వరద

గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ ప్రస్తుతం సామర్థ్యం 1.19 టీఎంసీలు కాగా దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 15 టీఎంసీలకు పెంచిన నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు వరద సమయంలో ప్రతిరోజు అర టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా అధికారులు డిజైన్‌ చేస్తున్నారు. జూరాలకు వానాకాలంలో సుమారు 120 రోజులపాటు వరద వస్తుంది. అయితే ఇక్కడ రోజుకు అర టీఎంసీ ఎత్తిపోయడం వల్ల కేవలం 30 రోజుల్లోనే రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపుకొనే వెసులుబాటు లభిస్తుంది.

వరద సమయంలో రోజు

అర టీఎంసీ ఎత్తిపోసేలా ప్రణాళిక

నెలాఖరు నాటికి డీపీఆర్‌ సిద్ధం చేసేలా కసరత్తు

ముమ్మరంగా కొనసాగుతున్నసర్వే పనులు

ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు తీరనున్న సాగునీటి కష్టాలు

Advertisement
 
Advertisement
Advertisement