మెళకువలతోనే సత్ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

మెళకువలతోనే సత్ఫలితాలు

Mar 5 2026 8:42 AM | Updated on Mar 5 2026 8:42 AM

చిత్తుపటాలు.. సోపాన క్రమాలు.. ప్రాక్టీస్‌ ముఖ్యం..

నారాయణపేట
‘పది’ పరీక్షల వేళ ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు

సాధన చేస్తే గణితం సులువే..

సైన్స్‌లో పట్టికలు, ప్రయోగాలే కీలకం

సాంఘికశాస్త్రంలో అవగాహన,

విశ్లేషణతో మంచి మార్కులు

గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026

నారాయణపేట రూరల్‌: విద్యాశాఖ తీసుకున్న కీలక నిర్ణయంతో పదోతరగతి వార్షిక పరీక్ష విధానంలో రెండింటి స్థానంలో మొత్తం సిలబస్‌పై ఒకేరోజు పరీక్ష రాయాల్సి ఉంటుంది. గణితం, సాంఘికశాస్త్రంలో 80 మార్కుల ప్రశ్నాపత్రంలో 20 మార్కులు పార్ట్‌–బికి కేటాయించారు. సామాన్యశాస్త్రానికి సంబంధించి భౌతిక, జీవశాస్త్రం పేపర్లు వేర్వేరుగా నిర్వహిస్తారు.

గణితంలో 14 అధ్యాయాలు ఉన్నాయి. వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, రేఖీయవర్గ స మీకరణాలు, శ్రేడులు, నిరూపక రేఖగణితం, సరూ ప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శరేఖలు, ఛేదన రేఖ లు, క్షేత్రమితి, సంభవ్యత, త్రికోణమితి, సంఖ్యాక శాస్త్రం అధ్యాయాలపై పట్టు సాధించాలి. ముందుగా సులువైన, తర్వాత కఠినమైన ప్రశ్నలను ప్ర యత్నించాలి. ఏ ఒక్క ప్రశ్నను వదలొద్దు. సీసీఈ వి ధానంలో ప్రతి అంశానికి మార్కులు కేటాయిస్తారు.

రేఖాచిత్రాలు పెన్సిల్‌తో గీయాలి. సూచికలు పెట్టా లి. సాధనలు డబ్బాలో రాయాలి. నిర్మాణాల కు అవసరమైన చిత్తుపటాలు తప్పకుండా గీయాలి. సోపాన క్రమాన్ని రాయాలి. పరీక్ష మొత్తం పూర్త య్యాక ఒకసారి జవాబు పత్రానికి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి.

పాఠ్యాంశాలు క్షుణ్ణంగా చదువి పటాలను ప్రాక్టీస్‌ చేసి వాటి భాగాలు గుర్తించే వి ధంగా నేర్చుకోవాలి. రేఖాకిరణ చిత్రా లు గీ సేటప్పుడు స్కేల్‌ ఉపయోగించాలి. ప్రయోగ విధానంలోని అంశాల ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అభ్యాస దీపిక ప్రశ్నల్లోని అంశాలను చదువుకొని, విద్యార్థులు బృందాలుగా ఏర్పడి చర్చించుకోవాలి.

– యాద్గిర్‌ జనార్దన్‌రెడ్డి,

భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు,

జెడ్పీ ఉన్నత పాఠశాల,

ముడుమాల్‌

Advertisement
 
Advertisement
Advertisement