అప్రమత్తతతోనే చోరీల నియంత్రణ : ఎస్పీ
నారాయణపేట: ప్రస్తుత సంక్రాంతి సెలవుల్లో చాలామంది కుటుంబాలతో కలిసి స్వగ్రామాలకు వెళ్తుంటారని.. ఇదే అదనుగా భావించి దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తూ చోరీలకు పాల్పడతారని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డా. వినీత్ పేర్కొన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని.. సిబ్బంది రాత్రిళ్లు గస్తీ నిర్వహిస్తారని చెప్పారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇంటి చిరునామా, ఫోన్‌న్‌నంబర్ సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేయిస్తే నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ఇరుగు పొరుగు వాళ్లకు తరచూ గమనిస్తూ ఉండాలని చెప్పడంతో పాటు ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్ మాల్స్‌లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లను ఇంటి ఆవరణలో నిలపాలని సూచించారు. బీరువా తాళం చెవులను వెంట తీసుకెళ్లాలని, ఇళ్లకు వేసిన తాళం కనిపించకుండా డోర్ కర్టెనన్ వేయాలని, ఇంట్లోని ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలన్నారు. ఇంటి ఎదుట చెత్తా చెదారం, పాల ప్యాకెట్లు జమకాకుండా చూడాలని, ప్రయాణం చేస్తున్నప్పుడు బంగారు నగలు, డబ్బు దగ్గరలో పెట్టుకోవాని సూచించారు. కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, సభ్యులు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ సెల్‌నంబర్ 87126 70399 సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
ధన్వాడ: ప్రతి రైతు ప్రత్యేక గుర్తింపు నంబర్ కోసం ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ కోరారు. శనివారం మండలంలోని కిష్టాపూర్, మందిపల్లి గ్రామపంచాయతీల్లో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే పథకాల కోసం ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తుందన్నారు. ఇందుకోసం ఆధార్‌కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌కు లింక్ ఉన్న మొబైల్ నంబర్‌తో ఏఈఓ లేదా సమీప మీసేవా కేంద్రానికి వెళ్లి నమోదు చేయించుకోవాలని సూచించారు. ప్రతి రైతువేదికలో నమోదు కార్యక్రమం కొనసాగుతోందని.. సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయశాఖ అధికారి నవీన్‌కుమార్, సర్పంచ్ కొండయ్య, సురేందర్‌రెడ్డి, ఏఈఓలు జైన్‌సింగ్, రాజు ఉన్నారు.
కేటీఆర్ సభ
ఏర్పాట్ల పరిశీలన
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 12న పాలమూరుకు వస్తున్నారని.. పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎంబీసీ మైదానంలో బహిరంగసభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుమెంబర్లను కేటీఆర్ సన్మానిస్తారని పేర్కొన్నారు. సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, పట్టణ అధ్యక్షుడు శివరాజు, మున్నూరు రాజు, ప్రభాకర్ పాల్గొన్నారు.
నేడు పాలమూరులో
బీసీ న్యాయసభ
మెట్టుగడ్డ: 42శాతం బీసీ రిజర్వేషన్ల సాధన – 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్‌తో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం బీసీ సామాజిక న్యాయసభను నిర్వహిస్తున్నట్లు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు రమేశ్‌గౌడ్ ప్రకటనలో తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఫౌండర్ చైర్మన్ చిరంజీవులు, మాజీ సుప్రీం కోర్టు జడ్జి జస్టీస్ ఈశ్వరయ్య, వి శారదన్ మహారాజ్, సంగెం సూర్యారావు పా ల్గొంటున్నట్లు తెలిపారు. కావున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.
అప్రమత్తతతోనే చోరీల నియంత్రణ : ఎస్పీ


