భళా బాలోత్సవం
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని బృందావన్ గార్డెన్స్‌లో సోమవారం పిల్లలమర్రి బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలోత్సవం నాలుగో పిల్లల జాతర అలరించింది. జిల్లావ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన వేలాదిమంది విద్యార్థులు బాలోత్సవానికి తరలివచ్చి జాతర జరుపుకున్నారు.అకాడమిక్ అంశాల్లో సీనియర్, జూనియర్ విభాగాల్లోని తొమ్మిది వేదికల్లో చిత్రలేఖనం, వ్యాసరచన, కథారచన, కవితారచన, దేశభక్తి గీతాలు, స్పెల్‌బీ, క్విజ్‌లు, సాంస్కృతిక అంశాల్లో జానపద, శాసీ్త్రయ నృత్యాలు, బతుకమ్మ వేషధారణ, ఏకపాత్రాభినయం, లఘు నాటికలు, ఫ్యాన్సీ డ్రెస్ అంశాల్లోనూ, సైన్స్‌ఫెయిర్ విభాగాల్లో విద్యార్థులు చురుగ్గా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఫ్యాన్సీ డ్రెస్‌లో వచ్చిన చిన్నారులకు నిర్వాహకులు అప్పటికప్పుడే మెడల్స్‌ను బహుకరించారు.
పిల్లల్లో దాగి ఉన్న
నైపుణ్యాన్ని వెలికితీయవచ్చు
పిల్లలమర్రి బాలోత్సవంతో పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయవచ్చని మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత అన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడు తూ చిన్నారులు మట్టిలో మాణిక్యాలు అని, వారిని చదువుతో పాటు ఆటల్లో ప్రోత్సహించాలన్నారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పిల్లలమర్రి బాలోత్సవం చక్కటి కార్యక్రమం అని కొనియాడారు. అంతకుముందు బాలోత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బెక్కం జనార్దన్, డాక్టర్ పి.ప్రతిభ జాతీయ జెండా, బాలోత్సవ జెండాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి వీరాంజనేయులు, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, వీణ శివకుమార్, సువర్ణలత, రాజేంద్రకుమార్, నాగేష్, ప్రమోద్‌కుమార్, వేణుగోపాల్‌వర్మ, వెంకటస్వామి, అశోక్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు


