అంజన్నకుచక్రతీర్థ స్నానం
మక్తల్: పడమటి ఆంజనేయస్వామి ఉత్సవాల సందర్భంగా శనివారం రాత్రి ఆలయంలో అశ్వవాహన సేవ, చక్రతీర్థస్నానం కనులపండువగా నిర్వహించారు. ఉదయం స్వామివారి కి చక్రతీర్థ స్నానం నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని అశ్వవాహనం ఉంచి ఆల యం చుట్టూ ఊరేగించారు. జిల్లా నలుమూల ల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో చైర్మన్ ప్రణేష్‌కుమార్, ఈఓ కవిత తదితరులు పాల్గొన్నారు.
శబరిమలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
నారాయణపేట రూరల్: శబరిమలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. జిల్లా కేంద్రం సమీపంలోని శబరి పీఠంలో శనివారం అయ్యప్ప మాలదారులతో ఆమె మాట్లాడారు. ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం సురక్షితమని, మాలధారులకు ప్రత్యేక ప్యాకేజీలతో శబరిమలకు బస్సులు నడుపుతున్నట్లు, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం రంగారెడ్డి ట్రైనీ కలెక్టర్ వీణ ఆధ్వర్యంలో 200 మంది మాలధారులకు అన్నదానం నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో డిపో సూపరింటెండెంట్ నరేందర్, ఏడీసీలు శ్రీనివాస్, ఆంజనేయు లు, గురు స్వాములు అప్పి, కాకర్ల భీమయ్య, వెంకటేష్, శంకర్ రెడ్డి, బాబు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీనివాసుడి కల్యాణం
దేవరకద్ర: చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి దేవాలయ ప్రాంగణంలో శ్రీనివాసుడి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది ఉత్సవాల్లో భాగంగా ఆనవాయితీగా నిర్వహిస్తున్న వేడుకను వేలాదిమంది భక్తులు తిలకించారు. ఉదయం ఆంజన్నకు పంచామృతాభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.
పరిశోధనలకు పెద్దపీట వేయాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పరిశోధనలకు పెద్దపీట వేయాలని వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. పీయూలో ఐపీఆర్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు పరిశోధన వాతావరణం నెలకొల్పాలని, ఐపీఆర్ హక్కులపై అవగాహన కల్పించాలన్నారు. కీనోట్ స్పీకర్ కేఆర్ పౌల్ మాట్లాడుతూ.. ఐపీఆర్ అనేవి వ్యక్తులు తమ ఆలోచనలను ఉపయోగించి, వస్తువులు ఇతర పరికరాలు తయారుచేస్తే వాటిని హక్కు లు కల్పిచేందుకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. వివిధ రకాల పేటెంట్లకు విదేశాల్లో చట్టపరమైన భద్రత ఉందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్‌బాబు, మధుసూదన్‌రెడ్డి కుమారస్వామి, రాజశేఖర్ పాల్గొన్నారు.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ రూ.2,739
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 15వేల క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. అత్యధికంగా 13,376 క్వింటాళ్ల ధాన్యం రాగా ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,739, కనిష్టంగా రూ.1,689 ధరలు పలికాయి. హంస గరిష్టంగా రూ.1,821, కనిష్టంగా రూ.1,689, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,951, కనిష్టంగా రూ.1701, పత్తి గరిష్టంగా రూ.6,177, కనిష్టంగా రూ.4,379, వేరుశనగ రూ.7,777 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,671, కనిష్టంగా రూ.2,359, సోనామసూరి గరిష్టంగా రూ.2,353, కనిష్టంగా రూ.2,129గా ధరలు పలికాయి.
అంజన్నకుచక్రతీర్థ స్నానం
అంజన్నకుచక్రతీర్థ స్నానం


