నామినేషన్ల ఘట్టం.. పరిసమాప్తం
నారాయణపేట: జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడతలో నారాయణపేట నియోజకవర్గంలో అభ్యర్థులు ఖరారయ్యారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో పోరులో నిలిచే అభ్యర్థుల జాబితాను అధికారులు అధికారికంగా ప్రకటించారు. సర్పంచ్ పదవులకు 257 మంది, వార్డులకు 1589 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. నాలుగు మండలాల్లో గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గంలోని నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్ మండలాల్లోని 85 గ్రామపంచాయతీలు, 681 వార్డులకు ఈనెల 14వ తేదీన పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులకు అధికారులు గుర్తులను కేటాయించారు. ఈ గుర్తులతోనే అభ్యర్థులు ఆదివారం నుంచి ప్రచారానికి వెళ్లనున్నారు.
10 జీపీలు ఏకగ్రీవం
నారాయణపేట నియోజకవర్గంలో మలివిడతలో 10 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. నారాయణపేట మండలంలో ఊటకుంటతండా, లింగంపల్లి, పిల్లిగుండ్ల తండా, దామరగిద్ద మండలంలో బాపన్‌పల్లి, దామరగిద్ద తండా, ఆశన్‌పల్లి, పిడెంపల్లి సర్పంచ్ స్థానాలు ఏకగీవ్రమయ్యారు. అలాగే, ధన్వాడ మండలంలో మందిపల్లితండా, దుడుగుతండా, బుడ్డమారితండాలు ఏకగ్రీవమయ్యాయి.
నేటి నుంచి మలివిడత ప్రచారం
మలి విడత ఎన్నికలు జరిగే 85 గ్రామపంచాయతీల్లో ఆదివారం నుంచి ప్రచారం జోరందుకోనుంది. ఆయా పార్టీల మద్దతు ఇవ్వగా, గుర్తులతో కూడిన పత్రాలను ముద్రించి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించనున్నారు. వలసవెళ్లిన ఓటర్లకు సైతం ఇప్పటికే ఫోన్ల ద్వారా అభ్యర్థులు సంప్రదిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమకే మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
మూడో విడతలో సర్పంచ్‌లకు 771, వార్డులకు 2,294 నామినేషన్లు
రెండో విడతలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
సర్పంచ్ బరిలో 257,వార్డుల్లో 1589 మంది
10 జీపీలు ఏకగ్రీవం.. జోరందుకోనున్న ప్రచారం
నామినేషన్ల ఘట్టం.. పరిసమాప్తం
నామినేషన్ల ఘట్టం.. పరిసమాప్తం


