కస్తూర్బాలు.. అక్రమాలకు నిలయాలు | - | Sakshi
Sakshi News home page

కస్తూర్బాలు.. అక్రమాలకు నిలయాలు

Nov 26 2025 11:06 AM | Updated on Nov 26 2025 11:06 AM

కస్తూ

కస్తూర్బాలు.. అక్రమాలకు నిలయాలు

నారాయణపేట రూరల్‌: అవినీతి, అక్రమాలకు జిల్లాలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. కేజీబీవీలకు మంజూరైన నిధులతో పాటు పిల్లలకు అందించే భోజనం వరకు అన్నింటిలోనూ ఎస్‌ఓలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీన్ని గుర్తించి ప్రశ్నించే విద్యార్థులు, వారి తల్లిదండ్రులను టార్గెట్‌ చేస్తున్నారు. మరోవైపు విచారణ చేసే అధికారులను సైతం రాజకీయ, ఉపాధ్యాయ సంఘాలతో భయపెట్టిస్తున్నారు. వీరిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా.. చర్యలు తీసుకోలేదు అనేది నగ్న సత్యం.

ఉన్నది ఒకటి.. రాయడం మరొకటి

ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో విద్యార్థుల సంఖ్యకు డైలీ అటెండెన్స్‌, జనరల్‌ అటెండెన్స్‌, మెనూ రిజిస్టర్‌కు సరిపోలడం లేదు. ప్రతిరోజు విద్యార్థుల సంఖ్యను అధికంగా చూపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జూన్లో 6వ తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఆలస్యంగా పాఠశాలలో చేరినా.. మొదటి నుంచే వారికి హాజరు వేసి భోజనం పెట్టించినట్టు లెక్కలు రాసినట్లు సమాచారం. ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏడాది రూ.లక్షకు పైగానే కేటాయిస్తోంది. కానీ అందుకు సరిపోయే వసతులు మాత్రం విద్యార్థులకు అందడం లేదనేది బహిరంగ రహస్యం. టెండర్లు మినహాయించి మిగతా వస్తువుల కొనుగోలులో ఎస్‌ఓలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.

అడ్మిషన్లలో అనర్హులే అధికం

తల్లిదండ్రులు లేని పిల్లలు, వలస వెళ్లిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకునేందుకు ఏర్పాటు చేసిన కేజీబీవీల్లో నిజమైన అర్హులు 10శాతం కంటే ఎక్కువ లేకపోవడం గమనార్హం. చాలామంది విద్యార్థులను రాజకీయ నాయకులు సిఫారసు చేయగా.. మరికొందరికి డబ్బులకు సీట్లు అమ్ముకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. పాఠశాలలో సంఖ్య పెరిగిన కొద్దీ వారి వ్యక్తిగత ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో చేరికలు చేసుకుంటున్నట్లు సమాచారం.

ఒకే చోట స్థిరపడి.. దుర్వినియోగానికి పాల్పడి..

ఏళ్ల తరబడి ఎస్‌ఓలు ఒకే కేజీబీవీలో విధులు నిర్వర్తిస్తుండడంతో వారి ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. వారు చేసిన తప్పులను ప్రశ్నించిన సీఆర్పీలు, పీజీసీఆర్పీలను వేధిస్తున్నారు. అధికారులు తనిఖీకి వెళ్తే ఉపాధ్యాయ సంఘాలతో అడ్డుకుంటున్నారు. ఇలా అన్ని రకాలుగా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గతంలో పనిష్మెంట్‌కు గురైన వారు సైతం తిరిగి అదే చోట పనిచేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గంలోని 4 మండలాల పరిధిలోని 2,136 మహిళా సంఘాలకు రూ.1.79 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినట్లు మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో మహిళా సంఘాలకు మంజూరైన రుణాల చెక్కులను మార్కెట్‌ చైర్మన్‌ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దామరగిద్దలో 716 సంఘాలకు రూ.58.52 లక్షలు, నారాయణపేటలో 705 సంఘాలకు రూ.59.57 లక్షలు, ధన్వాడలో 346 సంఘాలకు రూ.33.03 లక్షలు, మరికల్‌లో 369 సంఘాలకు రూ.27.87 లక్షలు కలిపి 2,136 సంఘాలకు గాను రూ.1,79 కోట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ మొగులప్ప, మార్కెట్‌ డైరెక్టర్‌ శరణప్ప, ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు మాధవరెడ్డి, డీఆర్‌డీఏ డీపీఎం మాసన్న, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు అరుంధతి, సుజాత, అంజమ్మ ఏపీఎంలు నారాయణ, అంజిలయ్య, వెంకట చారి, చెన్నప్ప, సీసీలు శ్రీనివాస్‌, అశోక్‌, లక్ష్మి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.

మహిళ సంఘాల సభ్యులకు చెక్కును అందజేస్తున్న మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివారెడ్డి

అమలులోకి కోడ్‌..

పంచాయతీ ఎన్నికల పాలకవర్గం గడువు ముగిసి సుమారు ఏడాదిన్నర కాలం పూర్తయ్యింది. నెలల తరబడి ఎన్నికల నిర్వహణ కోసం ఎదురుచూస్తుండటం, ఇప్పటికే ఒకసారి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసి, వాయిదా పడిన క్రమంలో ఈసారి ఎన్నికల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఓటర్ల జాబితా, బ్యాలెట్‌ పేపర్లు, ఎన్నికల సామగ్రి, ఎన్నికల సిబ్బందికి శిక్షణతోపాటు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేశారు. మంగళవారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాగా, ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా అధికార యంత్రాంగం పూర్తిస్థాయి ఏర్పాట్లలో నిమగ్నమైంది.

మచ్చుకు కొన్ని..

ధన్వాడ కేజీబీవీలో విద్యార్థుల సంఖ్య, పంపిణీలో తేడాలు వెలుగు చూశాయి. అధికారుల తనిఖీలు చేసే సమయంలో జూన్‌ ఇష్యూ రిజిస్టర్‌ లేకపోవడం, విద్యార్థులు ఇంటికి వెళితే అవుట్‌ గోయింగ్‌ రిజిస్టర్‌ సరైన విధంగా నమోదు చేయట్లేదు. ప్రతిదీ రెండు రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారు.

కోస్గి కేజీబీవీలో మార్చిలో వచ్చిన నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టి చేతులు దులుపుకున్నారు. వస్తువు కొనుగోలు, చేయించిన పనులకు మూడింతలు ఖర్చు రాసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏ ఒక్కరోజు భోజనం మెనూ ప్రకారం ఉండదని సమాచారం. ప్రశ్నించిన వారిపై బూతు పురాణం, రాజకీయ నాయకులతో బెదిరింపులకు దిగుతున్నారు.

కృష్ణా కేజీబీవీలో అక్రమాలు బయటపడొద్దనే ఉద్దేశంతో నిరంతరం వంటవారిని మారుస్తున్నట్లు సమాచారం. రాజీనామా లేకుండానే కొత్తవారిని తీసుకున్నారని కార్యాలయంలో ఫిర్యాదు వచ్చినట్లు తెలిసింది. అక్కడ టార్చర్‌ భరించలేక ఓ విద్యార్థిని రాత్రి గోడ దూకి పారిపోగా గ్రామస్తులు తిరిగి పాఠశాలలో అప్పజెప్పగా.. ఆ అమ్మాయికి టీసీ ఇచ్చి పంపినట్లు తెలిసింది. మార్చిలో రూ.3.5 లక్షల నిధులు వస్తే ఇష్టానుసారంగా ఏప్రిల్‌లో బిల్లులు సబ్మిట్‌ చేశారు. అధికారులు విచారణకు వస్తే ఉపాధ్యాయ సంఘ నాయకులతో బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

నేడు అనుగొండలో మంత్రుల పర్యటన

మక్తల్‌: అనుగొండలో ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పశుసంవర్ధక, మత్స్యసహకార మంత్రి వాకిటి శ్రీహరి బుధవారం పర్యటిస్తారని మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, మాజీ సర్పంచు గడ్డం రమేష్‌ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనుగొండ, అంకేన్‌పల్లి, దాదాన్‌పల్లి, గడ్డంపల్లి, ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌ గ్రామాలకు చెందిన రైతులతో ముఖా ముఖి కార్యక్రమం ఉంటుందని, ముంపు బాధితులందరూ విధిగా హాజరుకావాలని కోరారు. అంతకముందు హెలికాప్టర్‌లో భూత్పూర్‌, నేరడుగం గ్రామాల మీదుగా ఏరియల్‌ సర్వే చేస్తారని తెలిపారు.

నిధుల ఖర్చులో ఎస్‌ఓల చేతివాటం

మెనూ పాటించని వైనం

విద్యార్థుల సంఖ్య ఎక్కువ చూపిసరుకులు మాయం

ప్రశ్నించే వారిని టార్గెట్‌ చేస్తారనే ఆరోపణలు

చర్యలు తీసుకుంటాం

జిల్లాలోని కొన్ని కేజీబీవీలపై ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం. తనిఖీల్లో కొన్ని మా దృష్టికి వచ్చాయి. విచారణ జరిపి వీటిపై కలెక్టర్‌ నివేదిక ఇచ్చాం. అవినీతి రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – గోవిందరాజు, డీఈఓ

కస్తూర్బాలు.. అక్రమాలకు నిలయాలు 1
1/2

కస్తూర్బాలు.. అక్రమాలకు నిలయాలు

కస్తూర్బాలు.. అక్రమాలకు నిలయాలు 2
2/2

కస్తూర్బాలు.. అక్రమాలకు నిలయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement