నారాయణపేట రూరల్: రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం అందిస్తున్న రాయితీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి జాన్ సుధాకర్ సూచించారు. మండలంలోని జాజాపూర్ రైతువేదికలో మంగళవారం యాసంగి సీజన్కు సంబంధించిన వరి విత్తనాలను రైతులకు అందించారు. ఆర్‌ఎన్‌ఆర్ 15048 రకానికి చెందిన 25 కిలోల బస్తాకు సబ్సిడీ పోను రూ. 500 మాత్రమే చెల్లించాలన్నారు. వ్యవసాయ రంగానికి ప్రభు త్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని, రైతులు వ్యవసాయ అధికారు ల ద్వారా సూచనలు పాటించి అధిక దిగుబడి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, ఆర్టీఏ సభ్యులు పోషల్ రాజేష్, మండల వ్యవసాయ అధికారి దినకర్, ఏఈఓలు రాజేష్, అనిల్, అంజమ్మ, సుధాకర్, అనిల్, కాంగ్రెస్ నాయకులు మధుసూదన్‌రెడ్డి, శరణప్ప, వెంకటేష్, రవి, రాములు, తిరుమలప్ప పాల్గొన్నారు.


