
పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి
ధన్వాడ: భూ భారతి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు. గురువారం ధన్వాడ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల అధికారులతో భూ భారతి, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఎన్‌ఎఫ్‌బీఎస్ దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని తహసీల్దార్ సింధుజాకు అదనపు కలెక్టర్ సూచించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు.