
సారా తయారు చేస్తే జైలుకే..
సారా తయారు చేసినా.. గంజాయి విక్రయించినా జైలుకు పోవాల్సిందే. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సారా తయారీ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నా ఆకస్మిక దాడులు నిర్వహించి అడ్డుకట్ట వేస్తున్నాం. గంజాయిపై పోలీసుశాఖ సమన్వయంతో ఉక్కుపాదం మోపుతున్నాం.
– అనంతయ్య, ఎకై ్సజ్ సీఐ, నారాయణపేట
ప్రత్యేక నిఘా..
జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఎక్కడైనా గంజాయి మొక్కలు పెంచినా.. విక్రయించినా కేసులు నమోదు చేస్తున్నాం. యువత గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి. నిషేధిత మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలునిర్వహిస్తున్నాం.
– యోగేష్ గౌతమ్, ఎస్పీ
●