గుట్టుగా గంజాయి దందా! | - | Sakshi
Sakshi News home page

గుట్టుగా గంజాయి దందా!

Aug 22 2025 6:37 AM | Updated on Aug 22 2025 6:37 AM

గుట్ట

గుట్టుగా గంజాయి దందా!

నారాయణపేట
కలెక్టరేట్‌ భద్రమేనా..?
చిన్నపాటి వర్షాలకే మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లోకి నీరు చేరడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

శుక్రవారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2025

–8లో u

నారాయణపేట: జిల్లాలో గుడుంబా తయారీ గుట్టుగా సాగుతుండగా.. గంజాయి గుప్పుమంటోంది. రాష్ట్ర సరిహద్దుకు 20 కి.మీ. దూరంలో ఉన్న కర్ణాటకలోని గుర్మిట్కల్‌ అడ్డాగా గంజాయి దందా కొనసాగుతోందని పోలీసు, ఎకై ్సజ్‌శాఖ దాడుల్లో స్పష్టమవుతోంది. ఈ ఏడాది జిల్లాలో నమోదైన మూడు కేసులను పరిశీలిస్తే.. గుర్మిట్కల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఊట్కూర్‌, నారాయణపేట ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారు. మరో కేసులో నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన వారు ఉన్నారు. ఐదేళ్ల కాలంలో ఎకై ్సజ్‌శాఖ దాడుల్లో 6, పోలీసుశాఖ దాడుల్లో 8 గంజాయి కేసులు నమోదయ్యాయి.

రాష్ట్ర సరిహద్దు దాటి..

కర్ణాటక నుంచే అధికంగా గంజాయి సరఫరా జరుగుతోందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే జిల్లాలోని మక్తల్‌లో కృష్ణా చెక్‌పోస్టు, నారాయణపేటలో జలాల్‌పూర్‌ చెక్‌పోస్టు, దామరగిద్దలో కానుకుర్తి చెక్‌పోస్టు, ఊట్కూర్‌లో సంస్థాపూర్‌ వద్ద చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ సరిహద్దు దాటి జిల్లాలోకి గంజాయి ఎలా వస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే దామరగిద్ద మండలం సజానాపూర్‌, మాగనూర్‌ మండలం ఉజ్జెలి, కృష్ణా మండలంలోని చేగుంటా, కున్షి, హిందూపూర్‌, నారాయణపేట మండలంలోని ఎక్లాస్‌పూర్‌, ఊట్కూర్‌ సమీపంలోని ఇడ్లూర్‌, కొల్లూర్‌ గ్రామాలు సైతం కర్ణాటక సరిహద్దులో ఉన్నాయి. ఆ రోడ్డు మార్గానా గంజాయి విక్రయదారులు వస్తున్నారనే దానిపై పోలీసులు నిఘా పెట్టారు.

● జిల్లాలోని గుండుమాల్‌ మండలంలో ఓ తండాకు చెందిన ఆటోడ్రైవర్‌ గంజాయిని సినీ ఫక్కీలో విక్రయిస్తుంటాడనే ఆరోపణలు ఉన్నాయి. కోస్గి పట్టణంలో ఆటో డ్రైవర్లు, క్యాబ్‌ డ్రైవర్లను ఆసరాగా చేసుకొని గంజాయి దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని బువ్వమ్మ దర్గా సమీపంలోని శ్మశానవాటిక, హైదరాబాద్‌ రోడ్డులోని నూతన చిల్డ్రన్స్‌ పార్కు గుట్ట ఏరియా, పట్టణ శివారులో రాత్రివేళ యువతకు గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిసింది. జిల్లా కేంద్రంతో పాటు కృష్ణా, మాగనూర్‌, నా రాయణపేట, మక్తల్‌, కోస్గి పట్టణాల్లో పోలీసులు పటిష్ట నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

264 సారా కేసులు..

జిల్లాలో అక్కడక్కడ సారా తయారీ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎకై ్సజ్‌శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ.. నారాయణపేట, మద్దూర్‌, మరికల్‌, దామరగిద్ద, ధన్వాడ, ఊట్కూర్‌ మండలాల్లోని పలు తండాల్లో గుట్టుచప్పుడు కాకుండా సారాను తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఐదేళ్ల కాలంలో ఎకై ్సజ్‌ పోలీసులు 264 కేసులు నమోదుచేసి.. 140 మందిని బైండోవర్‌ చేశారు. ఈ కేసుల్లో ఐదుగురిని రిమాండ్‌కు పంపగా.. ఏడుగురికి జరిమానా విధించారు.

మక్తల్‌ శివారులో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి పాకెట్లు

జిల్లాలో విచ్చలవిడిగా విక్రయాలు

కర్ణాటక నుంచి అక్రమ రవాణా

శివారు ప్రాంతాల్లో యువతకు విక్రయం

ఇటీవల పోలీసులకు పట్టుబడినగుర్మిట్కల్‌ వాసులు

మరోవైపు ఆందోళన కలిగిస్తున్న

సారా తయారీ

గుట్టుగా గంజాయి దందా!1
1/1

గుట్టుగా గంజాయి దందా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement