
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
మరికల్/ధన్వాడ: సీజనల్ వ్యాధులు ప్రబలే అవకా శం ఉన్నందున వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం మరికల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మందుల స్టాక్‌ను పరిశీలించి.. సబ్ సెంటర్లకు అన్నిరకాల మందులను సక్రమంగా పంపిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. ప్రజలకు అందుబాటు లో ఉండి మెరుగైన సేవలు అందించాలని వైద్యుల కు సూచించారు. పీహెచ్‌సీలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ఆస్పత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కాగా, ఆస్పత్రిలో కాలం చెల్లి న మందులను ఎక్కడపడితే అక్కడ వేయడాన్ని గమనించిన కలెక్టర్.. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
65 ఇళ్లకు 11 మాత్రమే నిర్మాణంలో ఉన్నాయా?
మరికల్‌కు 65 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే.. కేవ లం 11 ఇళ్లు మాత్రమే బేస్‌మెంట్ దశలో ఉండటం ఏమిటని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అసహనం వ్యక్తంచేశారు. ఇళ్ల జాబితాలో పేర్లు ఉండి నిర్మించుకోలేని వారి పేర్లను వెంటనే తొలగించి.. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అదే విధంగా ధన్వాడ బీసీ కాలనీలో చివరి దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. స్లాబ్ లెవల్ వరకు ఇంటి నిర్మాణం పూర్తిచేసిన లబ్ధిదారు శారదను శాలువాతో సన్మానించి అభినందించారు. ధన్వాడ మండలానికి 500 ఇళ్లు మంజూరు కాగా.. మండల కేంద్రానికి 102 ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్లు రాంకోటి, సిందుజా, ఎంపీడీఓ వెంకటేశ్వర్‌రెడ్డి, డాక్టర్ రాఘవేంద్రారెడ్డి, ఎంపీఓ పావని, ఆర్‌ఐ సుధాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్యామ్‌సుందర్‌రెడ్డి ఉన్నారు.