
పని బారెడు.. వేతనం మూరెడు
నారాయణపేట
వాతావరణం
రోజంతా ఆకాశం నిర్మానుష్యంగాఉంటుంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025
నారాయణపేట రూరల్: విద్యాశాఖలో సీఆర్‌పీల పరిస్థితి ‘పనిబారెడు.. వేతనం మూరెడు’ అన్న చందంగా ఉంది. విద్యావిదానంలో నూతన పద్ధతులు అమలు చేస్తుండగా.. వీటి పర్యవేక్షణ కొరకు నియమించిన సీఆర్‌పీలకు మాత్రం సమాన పనికి సమా న వేతనం మాత్రం అందడంలేదు. రెండేళ్ల క్రి తం తమ డిమాండ్ల సాధనకు సీఆర్‌పీలు హైదరాబాద్‌లో ధర్నా సైతం చేపట్టారు. గత ఏడాది విధులు బహిష్కరించి జిల్లా కేంద్రాల్లో రిలే నిరహార దీక్షలు నిర్వహించిన రేవంత్ ప్రభుత్వం కనికరించలేదు.
నియామకం ఇలా..
ఉపాధ్యాయులు, అధికారులకు మద్య వారధులు గా ఉంటూ పాఠశాలలు, క్లస్టర్ ఇంచార్జీ, ఎంఈఓలకు అనుసంధానంగా పనిచేయడానికి సీఆర్‌పీలను నియమించారు. సీఆర్‌పీ వ్యవస్థ అంటేనే విపరీతంగా పని ఉంటుంది. దీంతో ఒత్తిడితో కూడిన పనులతో పాటు ఒక వైపు అధికారులు, మరో వైపు ఉపాధ్యాయ సంఘాలతో ఇబ్బందులు పడుతున్నారు. తరచూ పాఠశాలలకు వెళ్లి అవసరమైన నుంచి సమాచారం సేకరించాల్సి ఉంటుంది. కాంప్లెక్స్ హెచ్‌ఎంకు సహకరిస్తూ యూడైస్, చైల్డ్ ఇన్ఫో పూర్తి చేయాలి. ప్రతి నెలకు సంబంధించి డైరీ రాస్తూ, ఎస్‌టీపీఎస్ టీచర్లు లీవ్ పెడితే స్కూల్‌కు వెళ్లి పిల్లలకు పాఠం చెప్పాలి. ఇక ప్రతి నెల కాంప్లెక్స్ సమావేశం నిర్వహించాలి. దీనికితోడు సర్వేలు, బడిబయటి పిల్లల గుర్తింపు చేపట్టి, పాఠశాల వివరాలు, అక్కడి సమస్యలతో పాటు మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇక రవాణా సౌకర్యం లేని స్కూల్ గుర్తించాలి, మధ్యాహ్న భోజనం చూడాల్సి ఉంటుంది. క్లస్టర్ పరిధిలోని పాఠశాలలల్లో నిర్వహించే ఎస్‌ఎంసీ సమావేశాలకు హాజరు కావాలి. వారి నుంచి వచ్చిన వినతులు అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళాలి. ప్రతి పాఠశాలను నెలలో రెండు సార్లు సందర్శించి టీచర్ల పనితీరును గుర్తించాలి. వివిధ రకాలైన మేళాలు, పోటీలు న్విహించాలి, కేజీబీవీలను సైతం సందర్శించాలి
వేతనాల్లోనే వ్యత్యాసం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఆర్‌పీల వ్యవస్థ ప్రారంభంకాగా.. అరకొర వేతనంతోనే విధులు నిర్వహించారు. క్రమంగా పెరుగుతూ వచ్చిన జీతం ఇప్పటికి రూ.15వేలకు చేరింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా సీఆర్‌పీలకు తెలంగాణలో రూ.15 వేల గౌరవ వేతనం కొనసాగిస్తూ వచ్చింది. మూడే ళ్ళ క్రితం అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 19,350కు పెంచారు. కాని ప్రస్తుతం విభజన ఆంధ్రప్రదేశ్‌లో వీరితో పాటు నియామకం కాబడిన సీఆర్‌పీలకు దాదాపు రూ.23,500 అక్కడి ప్రభు త్వం చెల్లిస్తుంది. విధులు, బాధ్యతలు సమానంగా ఉన్న రెండు రాష్ట్రాల్లో మాత్రం వేతనం చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుత ప్రభుత్వమైన తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
ఐదు కాంప్లెక్స్‌లకు సీఆర్‌పీలు కరువు
జిల్లాలోని 13 మండలాల్లో 33 కాంప్లెక్స్‌లు ఉన్నాయి. వీటిలో ఐదు చోట్ల సీఆర్‌పీలు లేరు. నర్వ, మాగనూర్, దామరగిద,కోటకొండ,మద్దూర్‌కు సంబంధించిన సీఆర్‌పీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టుల్లోని వారు ఉపాధ్యాయ ఉద్యోగం రావడం, ఇతర ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. దీంతో ఆయా చోట్ల ఖాళీగా ఉన్న వాటిని పక్కనే ఉన్న ఇతర సీఆర్‌పీలకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
చాలీచాలని వేతనాలతోసీఆర్‌పీల అవస్థలు
విద్యాశాఖలో అదనపు భారంతో సతమతం
అందని ద్రాక్షగానే సమాన పనికి సమాన వేతనం