
కనులపండువగా ఆంజనేయస్వామి ఉత్సవాలు
మద్దూరు: మండల కేంద్రంలోని పాతబస్టాండ్ ఆంజనేయస్వామి ఉత్సవాలు అలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే జల్ధి ఊరేగింపు నిర్వహించారు. గంగజాలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ఊరేగింపు నడుమ ఆలయానికి తీసుకొచ్చారు. జైశ్రీరాం అనే నినాదాలతో హోరెత్తించారు. అనంతరం రాఘవేంద్రచారి ఆధ్వర్యంలో స్వామి వారికి విశేష పూజలు, అభిషేకం నిర్వహించారు. ఆలయ కమిటీ, దాతల సహకారంలో అన్నదానం చేశారు. ఇదిలాఉండగా, ఉత్సవాల సందర్భంగా పాతబస్టాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రెటపట్ల కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ పోటీల్లో ఉజ్జెలి, పల్లెర్ల, రెనివట్ల, క్యాతన్‌పల్లి, బొమ్మన్‌పాడ్, కంసాన్‌పల్లి, చెన్నారెడ్డిపల్లి, గుర్మిట్‌కాల్, తదితర గ్రామాలకు చెందిన వారు పాల్గొన్నారు.

కనులపండువగా ఆంజనేయస్వామి ఉత్సవాలు