
ప్రజా వీరుడు పండుగ సాయన్న
నారాయణపేట: పండుగ సాయన్న జయంతిని శుక్రవారం జిల్లా కేంద్రంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు సరాఫ్ నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ సాయన్న జయంతి, వర్ధంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చొరవ చూపేలన్నారు. జిల్లాలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో త్వరలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటుకు తగిన స్థలాన్ని పరిశీలించి విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా ముదిరాజ్ సంఘం కృషి చేస్తుందన్నారు. పట్టణ అధ్యక్షుడు మిర్చి వెంకటయ్య మాట్లాడుతూ సాయన్న జీవితాన్ని బీసీలందరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాంత్ కుమార్ మాట్లాడుతూ 1860 నుంచి 1890 మధ్యకాలంలో పెత్తందాదారులు, భూస్వాములు, పట్వారిలపై కొట్లాడి పెద్దోన్ని కొట్టు పేదోలకు పంచు అనే నిదానంతో జీవించారన్నారు. కార్యక్రమంలో పట్టణ భాజపా అధ్యక్షులు పోశల్ వినోద్ , జిల్లా ఆర్టిఏ మేంబర్ పోషల్ రాజేష్, పళ్ళ వెంకట్రాములు, మ్యాకల హన్మంతు, కాకర్ల భీమయ్య,గోవిందుగేరి గోపాల్ పాల్గొన్నారు.