
11 నుంచి పాదయాత్ర
ఆగస్టు 7న దామరగిద్ద మండలం కానుకుర్తి నుంచి భూ నిర్వాసితుల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 11న పేరపళ్ల నుంచి నారాయణపేట తహసీల్దార్ కార్యాలయం వరకు, 13న ఊట్కూర్‌లో, 14న కాట్రేవ్‌పల్లి నుంచి మక్తల్ తహసీల్దార్ కార్యాలయం వరకు , 20 21 తేదీలలో ‘చలో కాడా‘ (కొడంగల్)కు పాదయాత్రను చేపట్టేందుకు నిర్ణయించారు. ప్రభుత్వం స్పందించకపోతే ‘చలో సీఎం‘ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు భూ నిర్వాసితుల సంఘం నిర్ణయించింది. ఇదిలాఉండగా, ఇటీవల దామరగిద్ద మండలం కానుకుర్తిలో భూ నిర్వాసితులు చేపట్టిన దీక్షలకు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత సంఘీబావం తెలిపారు. ఆ గ్రామ రైతులు కవిత ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. తమ గోడు పట్టించుకునే నాథుడేవరంటూ గోడుమన్నారు.