
చదువులమ్మ ఒడిలో.. సరిగమలు
సంగీతం ఒక అద్భుతం. సృష్టిలో దాని స్థానం అద్వితీయం. అందుకే చదువుల తల్లి సరస్వతిదేవికి కూడా ఒక చేతిలో పుస్తకం.. మరో చేతిలో వీణ ఉంటుంది. రాతియుగం నుంచి కంప్యూటర్ యుగం దాకా సంగీతం స్వేచ్ఛగా రాజ్యమేలుతుంది. ఇంతటి మహత్తు కలిగిన సంగీత నాదం చదువులోనూ తోడైతే విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో ఉపకరిస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఆమేరకు చర్యలు చేపట్టాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సంగీత పాఠాలు బోధించేందుకు నిర్ణయించాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉదయం నుంచి రాత్రి వరకు పుస్తకాలతో కుస్తీ పడుతూ ఒత్తిడికి లోనయ్యే విద్యార్థులకు ఈ సంగీత పరికరాల సాధన ద్వారా కొంతైనా ఉపశమనం కలగనుంది. అంతేగాక, వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సాయపడనుంది. ఈమేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 36 పాఠశాలలను ఎంపిక చేశారు.
– నారాయణపేట రూరల్/ అచ్చంపేట రూరల్
కళలనుప్రోత్సహించడం హర్షణీయం
పిల్లలకు చదువుతోపాటు వివిధ కలలను నేర్పించడం ఎంతో హర్షనీయం. చిన్నతనం నుంచి సంగీతం నేర్చుకోవడం వల్ల దేశ సంస్కృతి, సాంప్రదాయాలు తెలుస్తాయి. సంగీతం వల్ల మనస్సు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కళల్లో ప్రావిణ్యం సంపాదిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. బాల కేంద్రానికి పరిమితమైన సంగీత శిక్షణ పాఠశాలకు విస్తరించడం స్వాగతిస్తున్నాం.
– మహిపాల్‌రెడ్డి, ఎస్పీ బాలు ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రతిభను వెలికితీసేలా..
ప్రభుత్వ బడుల్లో విద్యతోపాటు సంగీత తరగతుల నిర్వహణతో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే అవకాశం ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బోధనతో అలసటకు గురయ్యే పిల్లలు సంగీతంతో మరింత ఉత్సాహంగా ఉంటుంది. ప్రస్తుతం అనేక పాఠశాలలో టీచర్లు పాటాలను కథలు, గేయాల రూపంలో చెబుతూ విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నారు. సంగీత తరగతులు సత్ఫలితాలిస్తాయి.
– అన్నపూర్ణ, జీహెచ్‌ఎం, కానుకుర్తి, నారాయణపేట
సంగీత పరికరాలు వచ్చాయి
పీఎంశ్రీ పథకంలో జిల్లాలోని ఎంపిక చేయబడ్డ పాఠశాలలకు మొదటి విడత కింద సంగీత పరికరాలను పంపిణీ చేశారు. దీనికి సంబంధించి ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్నాం. 6నుంచి 12వ తరగతి విద్యార్థులకు వారానికి ఒక్కో పీరియడ్ సంగీతం, వాయిద్యాలపై శిక్షణ ఇచ్చేందుకు టైం టేబుల్ ఏర్పాటు చేస్తున్నాం. కాంట్రాక్ట్ పద్ధతిలో శిక్షకుల నియామకానికి సూచనలు చేశాం.
– గోవిందరాజు,
డీఈఓ, నారాయణపేట
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు వారి సర్వతోముఖాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నాయి. చదువుతోపాటు క్రీడలు, యోగా, కరాటే వంటి అంశాలను ఐచ్చికంగా నేర్చుకునే అవకాశాలు కల్పించింది. తాజాగా సంగీత పాటలు నేర్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పీఎం శ్రీ కింద ఎంపిక కాబడిన బడులకు ముందు అవకాశం కల్పించనుంది. ఈమేరకు ఉమ్మడి జిల్లాలో 36 పాఠశాలలను మొదటి విడత కింద ఎంపిక చేసి సంబంధిత పరికరాలను ఆ బడులకు పంపిణీ చేశారు. ఈమేరకు విద్యార్థులు రోజు పాఠ్యాంశాల బోధనకు పరిమితం కాకుండా వారంలో ఒక రోజు సంగీత పాఠాలు నేర్చుకోకున్నారు. దీంతో పిల్లలకు శ్రావణానందంతో పాటు ఏకాగ్రత పెరగనుంది. సంగీత సాధనతో వివిధ రకాలైన కళల్లో ప్రావీణ్యం పొందనున్నారు. పిల్లలు వాటిని నేర్చుకునేందుకు మరింత ఆసక్తి చూపనున్నారు. సంగీత సాధనతో టీవీ, సెల్ ఫోన్లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆయా వృత్తులలో సైతం స్థిరపడేందుకు ఉపకరిస్తుంది.
శిక్షకులు వస్తే ప్రయోజనం
పాఠశాలలకు సంగీత వాయిద్య పరికరాలు అంది నెల రోజులు అవుతుంది. కానీ, విద్యార్థులతో సాధన చేయించే శిక్షకులను మాత్రం ఇంకా నియమించలేదు. అన్ని రకాల వాయిద్యాలు తెలిసినవారు అరుదుగా ఉంటారు. సాధారణంగా ఒక్కో దాంట్లో ఒక్కొక్కరికి ప్రావీణ్యం ఉంటుంది. ఇలాంటి వారిని ఎంపిక చేయడం సులభమే కానీ అన్ని తెలిసిన వారికి రూ.10వేల గౌరవ వేతనం సరిపోతుందని ప్రభుత్వం భావిస్తుంది. భిన్న రంగాల్లో ప్రతిభ ఉన్న ఇద్దరిని నియమించి వేతన సర్దుబాటు చేస్తే పరిష్కారం లభిస్తుందని పలువురు అంటున్నారు. సంగీత పాటలు బోధించడంలో ఇప్పటికే ఆలస్యమైంది. వెంటనే సంగీత ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ పూర్తయితే సంగీత పాటలు బోధించేందుకు ఆస్కారం ఉంటుంది.
36 పాఠశాలలకు పరికరాల పంపిణీ
ఉమ్మడి జిల్లాలో పీఎం శ్రీ కింద ఎంపికై న 36 పాఠశాలలకు సంగీత పరికరాలను పంపిణీ చేశారు. డోలక్, తబలా, హార్మోనియం, డ్రమ్స్, వయోలిన్ వంటివి అందించారు. వీటిని 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులతో పాటు కేజీబీవీ, గురుకుల, మోడల్ స్కూళ్లలో ఇంటర్ విద్యార్థులకు సైతం నేర్పించనున్నారు.
తగ్గుముఖం పట్టిన వరద
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద ఆదివారం తగ్గుముఖం పట్టింది.
–8లో u
ప్రభుత్వ పాఠశాలల్లో సంగీత పాఠాలు
పీఎంశ్రీ స్కూల్స్‌కు
వాయిద్య పరికరాలు అందజేత
వారానికి ఒక తరగతి చొప్పున నిర్వహణ
శిక్షకుల నియామకానికి కమిటీ ఏర్పాటు
ఉమ్మడి జిల్లాలో 36 పాఠశాలలు ఎంపిక

చదువులమ్మ ఒడిలో.. సరిగమలు

చదువులమ్మ ఒడిలో.. సరిగమలు

చదువులమ్మ ఒడిలో.. సరిగమలు

చదువులమ్మ ఒడిలో.. సరిగమలు

చదువులమ్మ ఒడిలో.. సరిగమలు