
భూ నిర్వాసితులకు అన్యాయం చేయొద్దు
నారాయణపేట: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథ కం భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చె ల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎకరా భూమికి ఇస్తామన్న పరిహారం రూ. 14లక్షలు ఆమోదయోగ్యం కాదన్నారు. ఆ డబ్బుతో మరో ప్రాంతంలో భూమి కొనే పరిస్థితి లేదన్నారు. న్యాయమైన పరిహారం కోసం 20 రోజులుగా భూ నిర్వాసితులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించ డం సరికాదన్నారు. ప్రాజెక్టులకు భూములు ఇస్తు న్న భూ నిర్వాసితులకు అన్యాయం చేయొద్దని కో రారు. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఇచ్చే భూముల ధర నిర్ణయించేందుకు న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బాల్‌రాం మాట్లాడుతూ.. అన్నివిధాలా వెనుకబాటుకు గురైన ఈ ప్రాంతానికి పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం మంచిదేనని.. అదే స్థాయిలో భూ నిర్వాసితులకు ప్రభుత్వం ప్రాధా న్యం ఇచ్చి తగిన పరిహారం అందించాలని కోరారు. కాగా, భూ నిర్వాసితుల ధర్నా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రూరల్ ఎస్‌ఐ రాముడు, పట్టణ ఏఎస్‌ఐలు ఆంజనేయులు, అంజిలయ్య బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో భూ నిర్వాసితులు ఆంజనేయులు, హనుమంతు, సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు.