
ఎఫ్‌ఆర్‌ఎస్‌తో స్పీడ్‌గా
ఇది వరకు చేయూత పింఛన్లను బయో మెట్రిక్ ద్వారా చెల్లించే వాళ్లం. అయితే వృద్ధులు పింఛన్ పొందేందుకు ఇబ్బందులు పడేవారు. వారి చేతి వేలిముద్రలు అరిగిపోవడంతో తొందరగా మ్యాచ్ అయ్యేది కాదు. ఫేస్ రికగ్నేషన్‌తో పది సెకండ్లలో పింఛన్ పొందే అవకాశం లభించింది.
– వెంకటేశ్, ఏబీపీఎం, కొత్తపల్లి
పారదర్శకతతో పింఛన్ పంపిణీ
ఫే్‌స రికగ్నేషన్ యాప్‌తో పారదర్శకతతో పింఛన్ల పంపిణీ జరుగుతుంది. ఇప్పటికే డీపీఎంలు, ఏపీఎంలు, బీపీఎంలకు శిక్షణనిచ్చాం. స్మార్ట్‌ఫోన్లలో ఎఫ్‌ఆర్‌సీ యాప్ ద్వారా జిల్లావ్యాప్తంగా పింఛన్ పంపిణీ చేస్తున్నారు.
– మొగులప్ప, డీఆర్‌డీఓ, నారాయణపేట
వేలిముద్రతోనే బాగుండే..
సెల్‌ఫోన్‌లో ఫొటో తీసే సమయంలో కళ్లు కొట్టుకోవడంతో పింఛన్ తీసుకోవడం ఆలస్యం అవుతుంది. వృద్ధులు కావడం, కళ్ల ఆపరేషన్ అవడం, కంటి సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు వస్తున్నాయి. అదే పాతపద్ధతి వేలిముద్ర ద్వారా త్వరగా తీసుకునే అవకాశం ఉంది.
– వెంకటన్న, వృద్ధుడు, మరికల్
●

ఎఫ్‌ఆర్‌ఎస్‌తో స్పీడ్‌గా

ఎఫ్‌ఆర్‌ఎస్‌తో స్పీడ్‌గా