పశువులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు
నారాయణపేట: పశువులను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తారని ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. బుధవారం ఆయన పలు చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జలాల్‌పూర్, కానుకుర్తి, చేగుంట, క్రిష్ణ బ్రిడ్స్ దగ్గర, ఉజ్జెల్లి, సమస్తపూర్, లాల్‌కోట ఈ మేరకు చెక్‌పోస్టులు ఏర్పాటుచేశామని, పోలీసు, పశుసంవర్ధక శాఖ సిబ్బందితో షిఫ్ట్‌ల వారీగా సమన్వయంతో పనిచేస్తారన్నారు. ముఖ్యంగా జంతువుల అక్రమ రవాణ, గోవధ విషయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవన్నారు. బక్రీద్ పండుగ సందర్భం పశువుల రవాణా విషయంలో అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పశువులను రవాణా చేసే ప్రతి వాహనానికి తగు నిర్ధారిత ప్రమాణిక పత్రాలు ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలు పండుగలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా , మత సామరస్యంతో జరుపుకోవాలని ఎస్పీ కోరారు.
మానవీయ కోణంలో నష్టపరిహారం ఇవ్వాలి
ఊట్కూర్: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి భూ నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు గ్రామ సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఊట్కూర్‌లో బుధవారం నిర్వహించిన ఆర్‌ఆండ్‌ఆర్ గ్రామసభకు అడిషనల్ కలెక్టర్ సంచిత్ గాంగ్వార్ హాజరయ్యారు. గ్రామసభల్లో ఊట్కూర్, దంతన్‌పల్లి శివారుల్లో భూములు కోల్పోతున్న రైతుల పేర్లను చదివి వినిపించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఎత్తిపోతల పథకంలో పూర్తిగా భూములు కోల్పోతున్న రైతులకు ఆర్ ఆండ్ ఆర్ చట్టం ప్రకారం ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఇప్పటికె రెవెన్యూ అధికారులు రైతుల ఆర్థిక, సామాజిక సర్వే చేపట్టారని భూములు కోల్పోతున్న రైతులు వారి కుటుంబ వివరాలను పూర్తి స్థాయిలో ఇవ్వలేదని, వెంటనే వివరాలను అందించాలని కోరారు. దంతన్‌పల్లి శివారులో డిజిటల్ సర్వే చేపట్టడం వల్ల 15 మంది రైతుల భూముల కోల్పోతున్న వారి పేర్లు అనుభవదారుడిగా వచ్చాయని వెంటనే అధికారులు టిపన్ ద్వారా సర్వే చేపట్టాలని పలువురు రైతులు కోరారు. వారం రోజుల్లో మళ్లీ సర్వే నిర్వహిస్తామని అడిషనల్ కలెక్టర్ రైతలకు హామీ ఇచ్చారు. ఎకరా భూమికి రూ.60 లక్షల నష్టపరిహారం ఒకేసారి చెల్లించాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చింత రవి, ఎంపీడీఓ దనుంజయగౌడ్, ఆర్‌ఐ కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, యజ్ఞేశ్వర్‌రెడ్డి, లింగం, గోపాల్‌రెడ్డి, యజ్ఞాదత్తు రైతులు తరణ్ రెడ్డి, సురేంధర్‌రెడ్డి, భాస్కర్, రవి తదితరులు పాల్గొన్నారు.
పశువులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు


