పోలీసుల ఆకస్మిక తనిఖీలు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని పలు ప్రదేశాలలో ఎస్పీ యోగేష్‌కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు నార్కోటిక్స్ స్నైపర్ జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన, అక్రమ రవాణా జరగకుండా పగడ్బందీగా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా కిరాణా, కొరియర్, పాన్‌షాప్‌లలో తనిఖీలు నిర్వహించారు. ఎవరైన గంజాయి, మత్తు పదార్థాలు రవాణా చేస్తే డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.


