భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి
మద్దూరు: భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చట్టం ద్వారా సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం మద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆమె సమావేశం నిర్వహించారు. రెవె న్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరకాస్తుల పరిశీలన త్వరగా పూర్తి చేసి, విరాసత్, హద్దు సమస్యలు, అసైన్డ్, పేరు మార్పిడి, అన్నదమ్ముల బాగ పరిష్కా రం లాంటి సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో అధికారుల బృందం కొత్త చట్టం ద్వారా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కలెక్టర్ సూచించారు. ఈ దరఖాస్తుల పరిశీలన కోసం మద్దూరు, కోస్గి, మరికల్, నారాయణపేట ఆర్డీఓ కార్యాలయ తహసీల్దార్ల బృందం దరఖాస్తుల వారీగా పేపర్ వర్క్‌తో పాటు సమస్యలను పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలు ఎంత వరకు వచ్చాయని ఆర్డీఓ రాంచందర్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, తహసీల్దార్ అనిల్‌కుమార్, టీడీ వాసుదేవరావ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


